IND vs PAK : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నుందా?

By Mahesh Rajamoni  |  First Published Jun 9, 2024, 7:06 PM IST

T20 World Cup 2024, IND vs PAK : ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు 7 సార్లు త‌ల‌ప‌డ్దాయి. ఇందులో 6 సార్లు భార‌త్ పాకిస్తాన్ ను చిత్తుచేసింది. ఇక ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో మ‌రోసారి జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని చూస్తోంది టీమిండియా. 
 


T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-పాకిస్థాన్ మధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కోసం క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక‌ మ్యాచ్ కోసం నిరీక్షణ ముగిసింది. ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. మ‌రికాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ హై వోల్టేజీ మ్యాచ్ కు వ‌ర్షం విల‌న్ కానుంద‌ని స‌మాచారం. వర్షం కారణంగా ఈ హై వోల్టేజీ మ్యాచ్ జ‌రుగుతుందా? లేదా? అనే ఉత్కంఠను మ‌రింత‌గా పెంచుతోంది. జూన్ 9 ఉదయం న్యూయార్క్‌లో తుఫాను కార‌ణంగా వర్షం  కురిసింది. అయితే, వ‌ర్షం ప‌డి ఇప్ప‌టికే సాధార‌ణ ప‌రిస్థితులు రావ‌డం, ప్ర‌స్తుతం ఆకాశం నిర్మ‌లంగా క‌నిపిస్తోంది.

అయితే మ్యాచ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో అక్యూవెదర్ రిపోర్టులు మ‌ళ్లీ టెన్ష‌న్ పెంచుతున్నాయి. ఎందుకంటే మ‌రోసారి న్యూయార్క్ న‌గ‌రాన్ని వ‌ర్షాలు తాకే అవ‌కాశ‌ముంది. తాజా నివేదిక ప్రకారం, మ్యాచ్‌కు అరగంట ముందు వ‌ర్షం ప‌డ‌నుంద‌ని పేర్కొంది. న్యూయార్క్‌లో మధ్యాహ్నం 12 గంటల వరకు మేఘావృతమై ఉంటుంది, అయితే వర్షం పడే అవకాశం 40-50 శాతం ఉంటుందని వెద‌ర్ రిపోర్టులు తెలిపాయి. అయితే, వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయి. కానీ, ఓవ‌ర్ల‌ను త‌గ్గించి మ్యాచ్ ను నిర్వ‌హించవ‌చ్చు. 

Latest Videos

undefined

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్ప‌టికే తమ మొద‌టి మ్యాచ్ ను ఆడేశాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. మ‌రోవైపు పాకిస్తాన్ జ‌ట్టు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అమెరికా చేతిలో చిత్తుగా ఓడింది. విజ‌య ఉత్సాహంతో భార‌త్ ఉండ‌గా, ఓట‌మి కార‌ణంగా పాక్‌ జట్టు ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోంది. అమెరికా జట్టు పాకిస్థాన్‌ను ఓడించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భార‌త్-పాక్ మెగా మ్యాచ్‌కు ముందు న్యూయార్క్ పిచ్‌పై చాలా ప్రశ్నలు తలెత్తాయి. డ్రాప్ ఇన్ పిచ్‌లో బౌన్స్ అసాధార‌ణంగా కనిపించింది. దీంతో దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, వ‌ర్ష ప‌రిస్థితుల్లో పిచ్ ఎలా ఉంటుంద‌నేది మ‌రింత ఉత్కంఠ‌ను పెంచింది. 

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై కోట్లల్లో బెట్టింగ్.. రూ.5.42 కోట్ల పందెం వేసిన ర్యాపర్ డ్రేక్

click me!