India vs England: భారత్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్ లు జరగ్గా శుక్రవారం నుంచి రాంచీలో 4 టెస్టు ప్రారంభం అయింది. భారత్ తరఫున అకాశ్ దీప్ అరంగేట్రం చేస్తున్నాడు.
India vs England: వైజాగ్, రాజ్‌కోట్‌లలో జరిగిన టెస్టు మ్యాచ్ లలో రెండు అద్భుతమైన విజయాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ టెస్టు సిరీస్ లో భారత్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగ్గా అనూహ్యంగా భారత్ ఓటమిపాలైంది. రాంచీలో నిర్ణయాత్మకమైన టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఒక మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇంగ్లాండ్ విజయం సాధిస్తే ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్ కీలకం కానుంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
రాంచీలో భారత్ తో జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున మరో ప్లేయర్ టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన తొలి టెస్ట్ క్యాప్‌ను ఆకాష్ దీప్‌కు అందజేయడంతో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్ లోకి వస్తున్న 313వ ఆటగాడు ఆకాశ్ దీప్.
టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసేవాళ్లం.. రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. వాతావరణం కాస్త పొడిగా ఉంది. పిచ్ లో పగుళ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ పిచ్ స్వభావమే అది.. చివరి రెండు గేమ్‌లు బాగా ఆడాము. ఇక్కడ కూడా అదే జోష్ ను కొనసాగిస్తాం. టీమ్ లోని చాలా మంది యంగ్ ప్లేయర్ల గురించి గర్వంగా, వారు బాధ్యతను స్వీకరించారు.. దానికి తగినట్టుగా ఆడుతున్నారు అని తెలిపాడు.
IND VS ENG : బ్యాటింగ్ OR బౌలింగ్.. రాంచీ టెస్టులో ఎవరిది పై చేయి.. ? పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది?
బెన్ స్టోక్స్ మాట్లాడుతూ తాము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమైనదేననీ, మొదటి ఒక గంట పిచ్ ఎలా ఉంటుందనేది మ్యాచ్ గురించి మాకు తమకు ఆలోచన ఇస్తుందని చెప్పిన స్టోక్స్.. ఎల్లప్పుడూ బ్యాట్-ఫస్ట్ ట్రాక్‌గా ఉంటుందని అన్నాడు.
ఇరు జట్లు ఇవే..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
IPL 2024: మహ్మద్ షమీకి ఏమైంది?