భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో లీడ్ సాధించింది. రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది.
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను మన జట్టు 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో లీడ్ సాధించింది. రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది.