IND vs AFG: టీ20 రీఎంట్రీలో రోహిత్ శ‌ర్మ డకౌట్ .. శుభమన్ గిల్ పై ఫైర్ ! వీడియో ఇదిగో

By Mahesh Rajamoni  |  First Published Jan 11, 2024, 9:46 PM IST

India vs  Afghanistan T20 Series: మొహాలీ వేదిక‌గా భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య  జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్ రోహిత్ శ‌ర్మ రెండో బంతిని ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. రీఎంట్రీలో అద‌ర‌గొట్టాలనుకున్న రోహిత్ డ‌కౌట్ అయి  గ్రౌండ్ ను వీడుతూ  శుభమన్ గిల్ పై ఫైర్ అయ్యాడు. 
 


IND vs AFG 1st T20I: టీ20 రీఎంట్రీ మ్యాచ్ లో అద‌ర‌గొడుతాడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌.. డ‌కౌట్ గా వెనుదిరిగాడు. మొహాలీలో జరిగిన తొలి ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ టీ20 సందర్భంగా టీ20 జ‌ట్టులోకి దాదాపు 14 నెల‌ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ డకౌట్ అయ్యాడు. మైదానాన్ని వీడుతూ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మాన్ గిల్‌పై ఫైర్ అయ్యాడు. ప‌రుగు రావాల్సిన ద‌గ్గ‌ర క్రీజు నుంచి శుభ్ మ‌న్ గిల్ క‌ద‌ల‌క‌పోవ‌డం.. తొలి ఓవ‌ర్ రెండో బంతికే రిస్కీ ప‌రుగుకు రోహిత్ శ‌ర్మ‌ ప్ర‌య‌త్నించ‌డం.. చివ‌ర‌కు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల మ‌ధ్య గంద‌ర‌గోళం మ‌ధ్య హిట్ మ్యాన్ త‌న వికెట్ ను త్యాగం చేయాల్సి వ‌చ్చింది.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ20ల్లో తొలిసారి రోహిత్, గిల్ ఓపెనింగ్‌లతో బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లండ్‌తో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ తర్వాత అంటే దాదాపు 14 నెల‌ల త‌ర్వాత రోహిత్ శ‌ర్మ‌ తన మొదటి టీ20 ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే తొలి ఓవ‌ర్ రెండో బంతికి ఫజల్‌హాక్ ఫరూఖీ బౌలింగ్ లో  గ్రౌండ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ సారథి ఇబ్రహీం జద్రాన్ మిడ్-ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. రోహిత్ షాట్‌ను అద్భుతంగా ఆపడానికి అతను తన కుడివైపుకి దూసుకెళ్లాడు. అప్పటికే ట్రాక్‌లో ఉన్న రోహిత్ పరుగు చేయ‌డానికి కాల్ ఇచ్చాడు.

Latest Videos

IND VS AFG: ఇదేంది గురు ఇలా చేశావ్.. రెండో బాల్ కే రోహిత్ శ‌ర్మ ఇలానా !

మరోవైపు రోహిత్ ప‌రుగుకు రాగా, శుభ్ మ‌న్ గిల్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బంతిని చూస్తూ క్రీజు నుంచి క‌ద‌ల్లేదు. రోహిత్ కాల్ నుంచి గిల్ గ్రహించే సమయానికి, రోహిత్ అప్పటికే నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నాడు. జద్రాన్ బంతిని స్ట్రైకర్ ఎండ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ వేసి రోహిత్ ను ర‌నౌట్ చేశాడు. దీంతో రోహిత్ శ‌ర్మ రెండు బంతులు ఎదుర్కొని డ‌కౌట్ అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరి మధ్య జూనియర్ భాగస్వామి అయిన గిల్, రోహిత్ కోసం తన వికెట్‌ను త్యాగం చేయడానికి తన క్రీజ్‌ను వదలలేదు.. దీంతో రోహిత్ శ‌ర్మ వైదానం వీడుతూ.. గిల్ పై కోపంగా అరుస్తూ ఫైర్ అయ్యాడు. ఇక్క‌డ శుభ్ మ‌న్ గిల్ బంతిని చూసే బదులు రోహిత్ కాల్ కు ప్రతిస్పందించాల్సి ఉండివుంటే వికెట్ ప‌డేది కాదు.

శుభ్‌మన్ గిల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏడాది త‌ర్వాత మొహాలీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ రనౌట్ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇక్కడ రనౌట్ అయిన తర్వాత రోహిత్ శర్మ శుభ్‌మాన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిగో వీడియో.. 

 

Rohit Sharma dismissed for a 2 ball duck🦆 pic.twitter.com/rV86W5k4yN

— Ashish 🖤 (@imAshish_x18)


క్రికెట్ ఆడుతూ కుప్ప‌కూలాడు.. గ్రౌండ్ లోనే గుండెపోటుతో ప్లేయ‌ర్ మృతి

click me!