India vs Afghanistan T20 Series: మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్..ఆఫ్ఘన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక భారత బౌలర్ అక్షర్ పటేల్ అద్భుత ఔలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ టీమ్ భారత్ ముందు 159 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
IND vs AFG 1st T20I: భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఆఫ్ఘన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ అక్షర్ పటేల్ టెర్రిఫిక్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఆఫ్ఘన్ కీలక వికెట్లు తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 158/5 (20) పరుగులు చేసింది. భారత్ ముందు 159 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ 42 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 29 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 25 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్, బ్యాటర్స్ రహ్మానుల్లా గుర్బాజ్ తో పాటు రహమత్ షా ను ఔట్ చేశాడు. రహమత్ షాను క్రీన్ బౌల్డ్ చేయడం హైలెట్ గా నిలిచింది. అలాగే, మరో బౌలర్ మఖేష్ కుమార్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
IND VS AFG: భారత్-ఆఫ్ఘనిస్థాన్ టీ20లో యశస్వి జైస్వాల్ ఎందుకు ఆడటం లేదంటే..?
అఫ్గానిస్థాన్ వికెట్ల పతనం: 50-1 ( రహ్మానుల్లా గుర్బాజ్ , 7.6), 50-2 ( ఇబ్రహీం జద్రాన్ , 8.2), 57-3 ( రహమత్ షా , 9.6), 125-4 ( అజ్మతుల్లా ఒమర్జాయ్ , 17.1), 130-5 ( మహ్మద్ నబీ , 6)
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ ఉర్హక్.
IND v AFG: సెంచరీ కొట్టడం ఖాయం.. సరికొత్త రికార్డు సృష్టించనున్న రోహిత్ శర్మ