Australia West Indies Test Series: జనవరి 17 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అలాగే, వన్డే సిరీస్ కు కూడా టీమ్ ను ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ, వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కు ప్రమోషన్ ఇచ్చింది.
Australia West Indies Series: ఆస్ట్రేలియా రాబోయే వన్డే, టెస్టు సిరీస్ లకు టీమ్ ను ప్రకటించింది. వన్డే టీమ్ కు సంబంధించి పలు స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి నిచ్చింది. టెస్టు టీమ్ లోకి మరో ఇద్దరు ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చారు. స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ ఫస్ట్ చాయిస్ పేస్ త్రయానికి విశ్రాంతినిచ్చింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ కు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ లకు విశ్రాంతినిచ్చింది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా, నవంబర్ లో భారత్ లో గెలిచిన జట్టు నుంచి మార్కస్ స్టోయినిస్ కు చోటు కల్పించారు. భారత్ తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ట్రావిస్ హెడ్ ను స్మిత్ డిప్యూటీగా ఎంపిక చేశారు.
అన్ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ లాన్స్ మోరిస్ 13 మందితో కూడిన ఆసీస్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2022 జూన్ లో శ్రీలంకలో ఆస్ట్రేలియా తరఫున చివరిసారిగా ఆడిన జే రిచర్డ్సన్ ఫస్ట్ ఛాయిస్ పేసర్లకు విశ్రాతి నివ్వడంతో అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే, నాథన్ ఎల్లిస్, ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ, టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మాథ్యూ షార్ట్ లను ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 12 నెలల సమయం ఉందనీ, ఆరోన్ హార్డీ, మాట్ షార్ట్, జే రిచర్డ్సన్, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు జట్టుగా తమ మెరుగుదలకు, వన్డే క్రికెట్లో వారి వ్యక్తిగత అనుభవాలకు విలువైనవని జాతీయ సెలెక్టర్ జార్జ్ బెయిలీ అన్నారు. వన్డే సిరీస్ ఫిబ్రవరి 2న ఎంసీజీ లో ప్రారంభమవుతుంది. ఇక టెస్టు జట్టులో కూడా మార్పులు జరిగాయి.
భారత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..
ఆస్ట్రేలియా వన్డే జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జ్యే రిచర్డ్‌సన్, మాట్ షార్ట్, ఆడమ్ జాంపా.
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
Rohit Sharma: అరుదైన రికార్డు సృష్టించడానికి సిద్ధంగా రోహిత్ శర్మ.. !