'ముబారక్ హో లాలా'.. మహ్మద్ షమీ అర్జున అవార్డు అందుకోవ‌డంపై విరాట్ కోహ్లీ రియాక్ష‌న్ !

By Mahesh Rajamoni  |  First Published Jan 10, 2024, 10:03 AM IST

Mohammed Shami : టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ క్రికెట్ లో త‌న అద్భుతమైన ఆట‌తో రాణించినందుకు భార‌త ప్ర‌భుత్వం అర్జున అవార్డుతో స‌త్క‌రించింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రప‌తి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న ష‌మీకి భార‌త స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి తన అభినందనలు తెలిపాడు.
 


Virat Kohli congratulates Mohammed Shami: 2023 సంవత్సరంలో క్రికెట్ లో త‌న అద్భుత‌మైన ప్రదర్శనకు గుర్తింపుగా అర్జున అవార్డు అందుకున్న పేసర్ మహ్మద్ షమీకి భారత స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న వీడియోను షమీ షేర్ చేయగా, దానికి కోహ్లీ 'ముబారక్ హో లాలా' అని అంటూ అభినంద‌న‌లు తెలిపాడు. ప్రస్తుతం చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమీకి ప్రేక్షకుల నుంచి భారీ కరతాళ ధ్వనుల మధ్య సన్మానాలు జరిగాయి. ష‌మీ అర్జున అవార్డు అందుకున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Latest Videos

గత ఏడాది భారత్ లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లో షమీ 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మెగా టోర్నీలో కేవ‌లం ఏడు మ్యాచ్ లు మాత్ర‌మే ఆడిన ష‌మీ అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా రికార్డులు సృష్టించారు. అర్జున అవార్డు అందుకున్న త‌ర్వాత ష‌మీ స్పందిస్తూ.. 'ఈ రోజు నాకు రాష్ట్రపతి నుంచి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం సగర్వంగా.. సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడానికి ఎంతో సహాయం చేసిన.. నా ఒడిదుడుకులలో ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను... నా కోచ్, బీసీసీఐ, జట్టు సభ్యులకు, నా కుటుంబానికి, సిబ్బందికి, నా అభిమానులకు పెద్ద కృతజ్ఞతలు.. నా కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.. నా దేశం గర్వపడేలా నా వంతు కృషి చేస్తాను.  అందరికీ థ్యాంక్స్.. అర్జున్ అవార్డు గ్రహీతలకు అభినందనలు'' అని పేర్కొన్నాడు.

 

 

భార‌త టీ20 జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..

click me!