India vs Afghanistan T20I: మొహాలీ వేదికగా జరిగిన తొలివన్డేలో భారత్ ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. శివమ్ దుబే, జితేష్ శర్మ, తిలక్ వర్మ బ్యాట్ తో రాణించడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
India vs Afghanistan T20I: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ తన విజయ పరంపరను కొనసాగించింది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీ జరిగిన తొలి టీ20లో ఆప్ఘనిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. శివమ్ దూబే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోసించాడు. తన కెరీర్ లో రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు.
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన 1వ టీ20లో భారత్ అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించింది. శివమ్ దూబే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (60*) తో ఆతిథ్య జట్టు 159 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా తీశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ ను మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ ల కీలక భాగస్వామ్యం ఆఫ్ఘనిస్తాన్‌ను బ్యాటింగ్ పతనం నుండి కాపాడింది. భారత్‌పై అత్యధిక టీ20 స్కోరు (158/5) నమోదు చేసింది.
భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నిలకడగా ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్ 50 పరుగులు జోడించినప్పటికీ ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. నబీ-ఒమర్జాయ్ 68 పరుగులు జోడించే ముందు ఆఫ్ఘనిస్తాన్ 57/3కి పడిపోయింది. కొన్ని డెత్-ఓవర్ లో రాణించడంతో ఆఫ్ఘన్ స్కోర్ 158/5 చేరుకుంది. ఇక 159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మను కోల్పోయింది, అయితే శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మల సహకారంతో భారత్‌కు విజయం దక్కింది.
INDIA VS AFGHANISTAN: తన డకౌట్ పై రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే.. !
ఈ మ్యాచ్‌లో నబీ ఆఫ్ఘనిస్థాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. అజ్మతుల్లా 29 పరుగుల వద్ద అతనికి సహకరించాడు. టీ20 క్రికెట్‌లో భారత్ పై ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఇన్నింగ్స్‌లో రెండు 50+ భాగస్వామ్యాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ కూడా 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అలాగే, టీ20లో భారత్‌పై అఫ్ఘానిస్థాన్ అత్యధిక స్కోరు ఈ మ్యాచ్ లో చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక స్కోరు ఈ మ్యాచ్ లో నమోదుచేయగా, అంతకుముందటి అత్యధిక స్కోరు 2021 అబుదాబిలో జరిగిన ICC T20 ప్రపంచ కప్‌లో 144/7 గా ఉంది.
అలాగే, ఒమర్జాయ్-నబీలు 68 పరుగులు జోడించారు, ఇది భారత్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు ఏ వికెట్‌కైనా ఉమ్మడి అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 2010లో గ్రాస్ ఐలెట్‌లో భారత్‌పై అస్గర్ ఆఫ్ఘన్-నూర్ అలీ జద్రాన్ నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ పరుగులు అధికంగా సమర్పించుకున్నాడు.
IND vs AFG: టీ20 రీఎంట్రీలో రోహిత్ శర్మ డకౌట్ .. శుభమన్ గిల్ పై ఫైర్ ! వీడియో ఇదిగో
ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్‌తో భయంకరమైన మిక్స్‌అప్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ రెండో బంతికే డకౌట్ గా నిష్క్రమించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు. ఛేజింగ్ రెండో బంతికి కాల్ స్పందించని గిల్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు. అయితే, టీ20లలో రోహిత్ రనౌట్ కావడం ఇది ఆరో సారి. విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీతో పాటు భారత బ్యాటర్‌కు ఉమ్మడి అత్యధికం. భారత్, ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకు కేవలం ఆరు టీ20ల్లో మాత్రమే ఆడగా, అందులో ఐదింటిలో భారత్ విజయం సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు , ఆసియాకప్‌లో ఒకసారి ఇరు జట్లు తలపడ్డాయి. గతేడాది ఆసియా క్రీడల్లో (పురుషుల టీ20 పోటీ) భారత్-ఆఫ్ఘనిస్థాన్ తలపడ్డాయి.
IND vs AFG: ఇదేంది గురు ఇలా చేశావ్.. రెండో బాల్ కే రోహిత్ శర్మ ఇలానా !