IND vs AFG:మొహాలీ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.
IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, ముఖేష్ కుమ్రా డెత్ బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే శివతాండవం చేశారు. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో రింకు సింగ్ తొమ్మిది బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ ఇండోర్‌లో జనవరి 14న జరగనుంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఏం జరిగింది?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ శుభారంభం చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద ఔటయ్యారు. గుర్బాజ్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 25 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీని తర్వాత రహ్మత్ షా మూడు పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ తరువాత అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
29 పరుగుల వద్ద ఒమర్జాయ్‌ను అవుట్ చేయడం ద్వారా ముఖేష్ కుమార్ వారి భారీ భాగస్వామ్యాన్ని బ్రేక్ పడింది. ఈ సమయానికి ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 125 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత మహ్మద్ నబీ కూడా 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివర్లో నజీబుల్లా 19 పరుగులు చేసి ఆఫ్ఘనిస్థాన్ స్కోరును 150 పరుగులు దాటించాడు. కరీం జనత్ తొమ్మిది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరఫున ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబేకి ఒక వికెట్ దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఏం జరిగింది?
159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. తొలి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్‌కు మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతో రోహిత్ పెవిలియన్ దారి పడ్డారు. వాస్తవానికి, మిడ్-ఆఫ్‌లో షాట్ ఆడిన తర్వాత, రోహిత్ పరుగుల కోసం శుభ్‌మాన్‌ని పిలిచాడు, కానీ రోహిత్ వైపు చూడకుండా.. శుభ్‌మాన్ బంతిని చూస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలో రోహిత్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో పరుగుల కోసం పరుగెత్తలేదు. అప్పటికి రోహిత్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ కు చేరుకున్నాడు. ఇద్దరూ ఒకే చివర ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
రోహిత్ ఔటైన తర్వాత శుభ్‌మన్ దూకుడుగా ఆడుతూ భారీ షాట్లు కొట్టాడు. అయితే నాలుగో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి..స్టంపౌట్ అయ్యాడు. రహ్మానుల్లా గుర్బాజ్ బౌలింగ్ లో వికెట్ వెనుక ముజీబ్ ఉర్ రెహమాన్ చేత స్టంప్ అయ్యాడు. శుభ్‌మన్ 12 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు.
శివమెత్తిన శివమ్ దూబే.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబె చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో జితేశ్ శర్మ 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి వేగంగా రాణించాడు.తిలక్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 26 పరుగులు చేసి రాణించారు. మరోసారి రింకూ సింగ్ దూకుడుగా ఆడాడు. తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో 17.3 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచు విజయంతో టీమిండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. అంతేకాకుండా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జనవరి 14న ఇండోర్ వేదికగా జరుగనుంది.