T20 World Cup 2024 వార్మప్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధ్వంసం..

By Mahesh Rajamoni  |  First Published May 31, 2024, 8:04 PM IST

T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. 
 


T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 అస‌లు స‌మ‌రం షురూ కాక‌ముందే ఆట‌గాళ్లు దుమ్మురేపే ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి బ‌రిలో ఉన్న జ‌ట్లు. ఈ క్ర‌మంలోనే వెస్టిండీస్ బ్యాట‌ర్ దెబ్బ‌కు వార్మ‌ప్ మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధ్వంసకర దృశ్యం కనిపించింది. వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో గురువారం రాత్రి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 

300 స్ట్రైక్ రేట్‌తో  నికోల‌స్ పూర‌న్ విధ్వంసం.. 

Latest Videos

ఈ వార్మప్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. విండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 25 బంతుల్లో 75 పరుగుల బ్యాట్ తో విధ్వంస సృష్టించాడు. నికోలస్ పూరన్ త‌న‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. పూరన్ 300 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.

టెన్ష‌న్ పెంచుతున్న భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు ఉగ్రముప్పు

త‌న ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో నికోల‌స్ పూర‌న్ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కు ముందు ట్రైల‌ర్ చూపిస్తూ ప్ర‌త్యర్థి జ‌ట్ల‌కు హెచ్చ‌రిక‌లు పంపాడు. వెస్టిండీస్‌ ప్రత్యర్థి జట్లలో భయం క‌లిగించే బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టింది. నికోలస్ పూరన్‌తో పాటు వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చివర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ కూడా 18 బంతుల్లో 47 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా పటిష్టంగా నిలిచింది

257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. కంగారు టీమ్ ఆట‌గాళ్ల‌లో జోష్ ఇంగ్లిస్ 55 (30) ప‌రుగులు, నాథన్ ఎల్లిస్ 39 (22)  ప‌రుగులు, అష్టన్ అగర్
28 (13) ప‌రుగులు చేశాడు.

'నేను నా గర్ల్‌ఫ్రెండ్ ను తీసుకురావచ్చా?'.. సునీల్ నరైన్‌-గౌతమ్ గంభీర్ మొద‌టి చాట్‌లో

click me!