NZ vs Pak 4th T20I: నాలుగో టీ20లోనూ ఓడిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఘన విజయం..

By Rajesh Karampoori  |  First Published Jan 19, 2024, 11:01 PM IST

NZ vs Pak 4th T20I: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లోనూ పాకిస్థాన్ పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ రిజ్వాన్ 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు.  ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ శుక్రవారం (జనవరి 19) జరిగిన నాలుగో మ్యాచ్ లోనూ 7 వికెట్లతో ఓడింది.
 


NZ vs Pak 4th T20I: పాకిస్థాన్ టీమ్ పరాజయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది.  అతిథ్య న్యూజిలాండ్ చేతుల్లో వరుసగా నాలుగో టీ20లోనూ ఘోరంగా ఓటమి పాలైంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెలరేగి బ్యాటింగ్ చేశారు. పాక్ బౌలర్ల గాలి తీశారు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో న్యూజిలాండ్‌కు ఆరంభం సరిగా లేకపోయినా..  డారిల్, ఫిలిప్స్  ఐదవ వికెట్‌ కు బలమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో మిచెల్ (72*) గ్లెన్ ఫిలిప్స్ (70*)లతో దుమ్మురేపారు. ఇలా వీరు రాణించడంతో ఆతిథ్య న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.  

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ బౌలర్లు అనుకున్న విధంగా రాణించారు. పాక్ బ్యాట్స్ మెన్స్ ను కేవలం 158 పరుగులకే కట్టడి చేశారు. కీవిస్ బౌలర్ల దాటికి పాక్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ సామ్ అయూబ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన  వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ జట్టుకు అండగా నిలిచాడు. 

Latest Videos

undefined

పాకిస్థాన్ టీమ్ లో మహ్మద్ రిజ్వాన్ మాత్రమే రాణించాడు. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్‌తో సుదీర్ఘ భాగస్వామ్యానికి ప్రయత్నించాడు. కానీ, బాబర్ 19 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బాబర్ ఔటైన తర్వాత వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. దీని కారణంగా రిజ్వాన్‌పై ఒత్తిడి ఎక్కువైంది. ఇలా టెన్షన్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే 90 పరుగులు చేశారు. రిజ్వాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. బాబర్ ఆజం 11 బంతుల్లో 19 రన్స్ చేయగా.. చివర్లో వచ్చిన మహ్మద్ నవాజ్ 9 బంతుల్లోనే 21 రన్స్ చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది. ఈ సమయంలో న్యూజిలాండ్‌లో ఫాస్ట్ బౌలర్లు మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లు తీశారు. మిల్నే ఒక్క వికెట్ పడగొట్టాడు.  

159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్  ఫిన్ అలెన్ 8 పరుగులు చేయగా.. టిమ్ సీఫెర్ట్  ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరోవైపు  విల్ యంగ్ 4 పరుగులు మాత్రమే చేసి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. విశేషమేమిటంటే ఈ ముగ్గురిని షాహీన్ అఫ్రిది అవుట్ చేయడం. అయితే దీని తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బాధ్యతలు స్వీకరించి పాక్ బౌలర్లను చిత్తు చేశారు. చివరకు ఇద్దరూ కలిసి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో మిచెల్ (72* పరుగులు ) గ్లెన్ ఫిలిప్స్ ( పరుగులు 70*)లతో దుమ్మురేపారు. ఇలా వీరద్దరూ రాణించడంతో ఆతిథ్య న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.  

click me!