Rohit Sharma: ఆప్ఘనిస్థాన్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ 3-0 సిరీస్ ను గెలుచుకుంది. ఈ సిరీస్ లోని మూడో మ్యాచ్ సూపర్ థ్రిల్లింగ్ తో ముగిసింది. రెండు సూపర్ ఓవర్ల తర్వాత భారత విజయం సాధించింది. అయితే, రెండు సూపర్ ఓవర్లలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం-సూపర్ ఓవర్ రూల్స్ పై ఇప్పటికీ హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
Super Over - Rohit Sharma: ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్ టీ20 సిరీస్ 3-0 అధిక్యంతో గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ను వైట్ వాష్ చేసింది. అయితే, మూడు టీ20ల సిరిస్ లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో, చివరి టీ20 పై ఇప్పటికీ హాట్ హాట్ గా చర్చసాగుతోంది. ముఖ్యంగా సూపర్ ఓవర్-రోహిత్ శర్మ అంశం ట్రేండీగా మారింది. సూపర్ ఓవర్లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండుసార్లు బ్యాటింగ్ చేయడంపై అఫ్గానిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం సూపర్ ఓవర్ లో భారత్ గెలవడానికి రోహిత్ శర్మనే కారణం.. తొలి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసి రిటైరైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను రెండో సూపర్ ఓవర్ లో కూడా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఇదే అంశంపై చాలా మంది నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అఫ్గానిస్థాన్ జట్టు కూడా ప్రశ్నించింది.
సూపర్ ఓవర్లో హై డ్రామా.. !
నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు 212 పరుగులతో సమంగా నిలిచాయి. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ కు వెళ్లాయి. అయితే, మొదటి సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్లు సమంగా పరుగులు చేయడంతో మళ్లీ అదే కథ.. ఫలితం రాకపోవడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాయి. చివరకు టీమిండియా విజయం సాధించింది.
విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !
సూపర్ ఓవర్లలో రెండు సార్లు రోహిత్ శర్మ బ్యాటింగ్.. !
తొలి సూపర్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ చివరి బంతికి 2 పరుగులు అవసరమైనప్పుడు నాన్ స్ట్రైక్లో ఉండటాన్ని గమనించి పేసర్ రింకూ సింగ్ కు వికెట్ మధ్య రన్నింగ్ లో బ్యాటింగ్ కు అనుమతించాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు చేయడంలో విఫలమైన భారత్ మ్యాచ్ ను రెండో సూపర్ ఓవర్ కు తీసుకెళ్లింది.
సూపర్ ఓవర్ రూల్ ఏం చెబుతోంది?
సూపర్ ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్ మెన్ మాత్రమే ఆడాలి. 6 బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోతే ఆట ముగిసిపోతుంది. రెండో సూపర్ ఓవర్ జరిగితే తొలి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లకు మళ్లీ ఆడే అవకాశం ఉండదు. అయితే గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మను రెండో ఓవర్లో ఆడనివ్వడం గురించే ఇప్పుడు చర్చ మొదలైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, నిబంధనల ప్రకారం ఇది సరియైనదే. ఎందుకంటే తొలి సూపర్ ఓవర్ లో రోహిత్ శర్మ ఔట్ కాలేదు. కేవలం రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇంకా సూపర్ ఓవర్ పూర్తి కాలేదు. కాబట్టి ఇక్కడ రోహిత్ శర్మను ఔట్ గా పరిగణించరు. పూర్తిగా ఆడిన ప్లేయర్ గానూ పరిగణించరని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ, జో రూట్ !
రెండో సూపర్ ఓవర్ లో భారత్ విజయం..
రెండో సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. 13 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ తరఫున లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ దెబ్బకొట్టాడు. రెండు పరుగులు ఇచ్చి మహ్మద్ నబీ, రహ్మానుల్లా గుర్బాజ్ వికెట్లు పడగొట్టి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
భారత్ కు కంగారుల సవాల్.. రోహత్ శర్మ సేన WTC రేసులో నిలుస్తుందా? మరో ట్విస్ట్ !