ICC fined Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అత్యంత ఘోరమైన ఓటమితో ఉన్న భారత జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో రెండు పాయింట్లను కట్ చేసింది.
ICC fined India: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమి బాధలో ఉన్న భారత్ కు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) షాక్ ఇచ్చింది. భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అలాగే, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో 2 ముఖ్యమైన పాయింట్లను కట్ చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
టీమ్ఇండియాకు ఐసీసీ జరిమానా..
భారత జట్టుకు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ శిక్ష విధించారు. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది కోసం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది. అలాగే, డబ్ల్యూటీసీలో ఒక్కో ఓవర్ కు ఒక పాయింట్ కట్ అవుతుంది.
చిరంజీవి వల్లే సినిమాల్లోకి, లేకుంటే హీమాలయాలే.. విక్టరీ వెంకటేష్ కామెంట్స్
రోహిత్ శర్మ ఏం చెప్పారు?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ శిక్షను అంగీకరించాడనీ, అందువల్ల అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, లాంగ్టన్ రుసెర్, థర్డ్ అంపైర్ అహ్సాన్ రజా, నాల్గవ అంపైర్ స్టీఫెన్ హారిస్ ఈ శిక్షను విధించారు. సెంచూరియన్ లో ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి
డీన్ ఎల్గర్ భారీ సెంచరీ, మార్కో జాన్సెన్ తో సెంచరీ భాగస్వామ్యం తర్వాత, నాంద్రే బర్గర్ నేతృత్వంలోని బౌలర్ల మెరుపు ప్రదర్శనతో దక్షిణాఫ్రికా తొలి క్రికెట్ టెస్టును మూడో రోజుల్లోనే ముగించింది. భారత్ ను ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కసిగో రబాడ 7 వికెట్లు, నంద్రే బర్గర్ 7 వికెట్లతో భారత్ ను శాసించారు.
ఇదేందయ్యా ఇది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్.. ఆగిన మ్యాచ్ !