AUS vs PAK : కంగారుల చేతిలో చిత్తు.. పాకిస్తాన్ కు దిమ్మదిగిరే షాక్..

By Mahesh Rajamoni  |  First Published Dec 29, 2023, 4:36 PM IST

AUS vs PAK: బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 2-0తో ఆధిక్యం సాధించింది.
 


Australia Beat Pakistan: మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో కంగారూ జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ పై 360 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు మెల్బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో 79 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవ‌సం చేసుకుంది. 2024 జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.

రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున మార్నస్ లబుషేన్ అత్యధికంగా 63 పరుగులు చేశాడు. అలాగే, ఖ‌వాజ‌ 42, మిచెల్ మార్ష్ 41 పరుగులు చేశారు. పాక్ తొలి ఇన్నింగ్స్ లో అమీర్ జమాల్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మీర్ హమ్జా, హసన్ అలీ తలో వికెట్ తీశారు. 

Latest Videos

చిరంజీవి వల్లే సినిమాల్లోకి, లేకుంటే హీమాలయాలే.. విక్టరీ వెంకటేష్ కామెంట్స్

ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో పాక్ జట్టును 264 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 5 వికెట్లు తీయగా, ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కు 1 వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది. పాకిస్థాన్ కు ముందు 317 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేయడానికి, 15 టెస్టు మ్యాచ్ ల ఓటమి పరంపరను బ్రేక్ చేయడానికి పాకిస్థాన్ కు 317 పరుగులు అవసరం కాగా,  237 పరుగులకే కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సిడ్నీలో మూడో, చివరి టెస్టు

2024 జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. 1999 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై పాక్ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. ఏ దేశంలోనైనా ఒక విజిటింగ్ జట్టు వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్ లు ఓడిన అవమానకర రికార్డు ఇదే. 1999లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0తో గెలుచుకుంది. ఆ తర్వాత 2004లో స్వదేశంలో పాకిస్థాన్ ను 3-0తో ఓడించిన ఆస్ట్రేలియా, 2009లో 3-0తో, 2016లో మళ్లీ 3-0తో, 2019లో మళ్లీ 2-0తో ఓడించింది. ప్ర‌స్తుత సిరీస్ లో ఇప్ప‌టికే రెండు టెస్టుల‌ను గెలుచుకుంది. కంగారూ జట్టు ఫామ్ చూస్తుంటే పాకిస్థాన్ ను 3-0తో తుడిచిపెట్టే అవకాశం ఉంది.

ఇదేందయ్యా ఇది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న‌ అంపైర్.. ఆగిన మ్యాచ్ !

click me!