ICC Champions Trophy 2025: అత్యధిక పరుగులు, వికెట్ల‌ వీరులు వీరే

Published : Mar 03, 2025, 06:42 PM IST
ICC Champions Trophy 2025: అత్యధిక పరుగులు, వికెట్ల‌ వీరులు వీరే

సారాంశం

ICC Champions Trophy 2025 Stats : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వరుణ్ చక్రవర్తి, న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీలు ఈ టోర్నమెంట్‌లో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు న‌మోదు చేశారు.   

ICC Champions Trophy 2025 most run & wickets: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 తుదిద‌శ‌కు చేరుకుంది. మొత్తం 8 జ‌ట్లు పాల్గొన్న ఈ ఐసీసీ టోర్న‌మెంట్ నుంచి నాలుగు జ‌ట్లు ఔట్ కాగా, మ‌రో 4 టీమ్స్ సెమీ ఫైన‌ల్ కు చేరుకున్నాయి. 

గ్రూప్ A నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ B నుంచి  దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయి. భారత్-ఆస్ట్రేలియాలు  మధ్య మొదటి సెమీ-ఫైనల్ మార్చి 4న యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఆ త‌ర్వాత దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్  మ‌ధ్య రెండో సెమీ-ఫైనల్ మార్చి 5న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది.

 

 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక్క ఓట‌మిలేని భార‌త్ 

 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు ఒక్క ఓట‌మి లేకుండా అజేయంగా నిలిచిన ఏకైక జట్టు టీమిండియా. లీగ్ ద‌శ‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించి సెమీస్ కు చేరుకుంది. అలాగే, చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి గ్రూప్ Aలో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా గ్రూప్ Bలో రెండు విజయాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ త‌ర్వాత ఆసీస్ ఉంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ దశ తర్వాత టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ స్టార్ బెన్ డకెట్ 227 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అత‌ని త‌ర్వాత జోరూల్ 225 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ 216 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా అత‌ను సాధించాడు.  లాహోర్‌లో ఇంగ్లాండ్‌పై 146 బంతుల్లో 177 పరుగులు చేసి ఇబ్ర‌హీం జ‌ద్రాన్ చ‌రిత్ర సృష్టించాడు. 

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌లలో క‌లిపి 150 పరుగులు చేసిన‌ శ్రేయాస్ అయ్యర్  టీమిండియా త‌ర‌ఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఇక బౌలింగ్ విష‌యినికి వ‌స్తే న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. అలాగే, మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తిలు ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశారు.

గ్రూప్ దశ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ రికార్డులు: 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025: అత్యధిక పరుగులు

బెన్ డకెట్ (ఇంగ్లాండ్): 3 ఇన్నింగ్స్‌లలో 227 పరుగులు
జో రూట్ (ఇంగ్లాండ్): 3 ఇన్నింగ్స్‌లలో 225 పరుగులు
ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్థాన్): 3 ఇన్నింగ్స్‌ల్లో 216 పరుగులు
టామ్ లాథమ్ (న్యూజిలాండ్): 3 ఇన్నింగ్స్‌లలో 187 పరుగులు
శ్రేయాస్ అయ్యర్ (భారత్): 3 ఇన్నింగ్స్‌లలో 150 పరుగులు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025: అత్యధిక వికెట్లు

మాట్ హెన్రీ (న్యూజిలాండ్): 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు
అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్): 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు
విలియం ఓ'రూర్కే (న్యూజిలాండ్): 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు
బెన్ ద్వార్షుయిస్ (ఆస్ట్రేలియా): 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు
జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్): 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు

 

 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025: అత్యధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు

ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్థాన్): 177 vs ఇంగ్లాండ్
బెన్ డకెట్ (ఇంగ్లాండ్): 165 vs ఆస్ట్రేలియా
జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా): 120 vs ఇంగ్లాండ్
జో రూట్ (ఇంగ్లాండ్): 120 vs ఆఫ్ఘనిస్తాన్
టామ్ లాథమ్ (న్యూజిలాండ్): 118 vs పాకిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025:  బెస్ట్ బౌలింగ్ 

వరుణ్ చక్రవర్తి (భారత్): 5/42 vs న్యూజిలాండ్
మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్): 5/42 vs ఇండియా
మహ్మద్ షమీ (భారత్): 5/53 vs బంగ్లాదేశ్
అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్): 5/58 vs ఇంగ్లాండ్
మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్): 4/26 vs బంగ్లాదేశ్

Champions Trophy IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ ఫ్రీగా చూడొచ్చు?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?