
Champions trophy 2025లో Ind vs Aus టీం చాలా కీలకంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ టీం.. ప్రతి ఐసీసీ టోర్నీలోనూ టీమ్‌ఇండియాను వెన్నంటే తిరుగుతూ, ప్రతిసారి సవాల్ విసిరే జట్టు ఇదే. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, పొట్టి వరల్డ్‌కప్ సూపర్ 8 పోరులో భారత్, ఆసీస్ తలపడగా, ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) సెమీఫైనల్‌లో మరోసారి పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు Champions trophy 2025 Finalకు కు వెళ్తారు. మరి ఇరుజట్ల బలాబలాలు, కీలక ఆటగాళ్ల ఫామ్‌పై ఓ విశ్లేషణ చూద్దాం.
గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత సేన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా, న్యూజీలాండ్ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించి, ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమిండియా కీలకమైన సెమీస్‌కు సిద్ధమవుతోంది. India vs Australia semi final దుబాయ్ లోనే జరగనుండటంతో, టీమ్‌ఇండియా కాస్త ఫేవరెట్ గా కనిపిస్తోంది. అయితే, మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. గత వన్డే ప్రపంచకప్‌ను గుర్తు చేసుకుంటే చాలు. టోర్నీ ఆరంభంలో తడబడినప్పటికీ, అదరగొట్టి ఫైనల్‌లో భారత్‌ను ఓడించి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ సెమీస్ చేరింది.
ఈసారి ఆసీస్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. వన్డే ప్రపంచకప్‌ను గెలిపించిన మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి స్టార్ పేసర్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో, వారి స్థానంలో కొత్తవాళ్లే బరిలోకి దిగుతున్నారు. స్పెన్సర్ జాన్స్, నాథన్ ఎల్లిస్, డ్వారిషూస్ వంటి బౌలర్లు ఉన్నా, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం తక్కువ.
అంతేకాదు, గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు 350+ పరుగులు చేసినప్పుడు ఆసీస్ బౌలింగ్ దారుణంగా తడబడింది. అఫ్గానిస్థాన్ కూడా వర్షం అంతరాయమైన మ్యాచ్‌లో 270+ పరుగులు చేయగలిగింది. వీటన్నింటినీ చూస్తే, ఆసీస్ బౌలింగ్ విభాగం భారత్‌తో పోల్చితే చాలా వెనుకబడి ఉందని స్పష్టమవుతుంది.
బౌలింగ్ అంతగా ప్రభావం చూపనప్పటికీ, ఆసీస్ బ్యాటింగ్ మాత్రం మరింత దూకుడుగా ఉంది. ప్రధానంగా, భారత్‌పై రెచ్చిపోయే ఆటతీరు కలిగిన ట్రావిస్ హెడ్ తన ఫామ్‌ను దొర్లించుకున్నాడు. అఫ్గాన్‌పై హాఫ్ సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. మరోవైపు, మాథ్యూ షార్ట్ గాయంతో టోర్నీకి దూరమైనా, అతని స్థానంలో తీసుకున్న ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోల్లీ ఆసీస్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.
ఇక, ఓపెనర్‌గా జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ రావడంతో, అతడు ట్రావిస్ హెడ్ మాదిరిగానే దూకుడుగా ఆడతాడని విశ్లేషకుల అంచనా. మిడిలార్డర్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా, గత కొన్ని మ్యాచ్‌లలో ఫామ్ కోల్పోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి తన మునుపటి దూకుడును చూపిస్తున్నాడు.
తద్వారా, ఆసీస్‌కు ప్రధాన బలం బ్యాటింగ్ అనే చెప్పాలి. కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థిరమైన ఆటతీరుతో ఎప్పుడూ నమ్మకంగా నిలబడతాడు. అతడికి ఫామ్‌తో సంబంధం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా పరుగులు చేయగల ఆటగాడు.
టీమ్‌ఇండియా అన్ని మ్యాచులను దుబాయ్‌లోనే ఆడుతూ గెలుస్తూ వస్తోంది. ప్రధానంగా, గ్రూప్ స్టేజ్‌లో కివీస్‌పై విజయం కీలకం. ఆ మ్యాచ్‌లో టాప్ 3 బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరినా, మిడిలార్డర్ నిలబడి మ్యాచ్‌ను గెలిపించింది. దుబాయ్ పిచ్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించడం అనేది చిన్న విషయం కాదు.
ఇక, భారత బౌలింగ్ విభాగం ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది. నలుగురు స్పిన్నర్ల ప్రయోగం విజయవంతం అవ్వడంతో, సెమీస్‌లోనూ అదే విధానం కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఫీల్డింగ్‌లోనూ టీమ్‌ఇండియా మెరుగుదల చూపింది. క్యాచ్‌లను ఒడిసిపట్టడమే కాక, పరుగులను సమర్థంగా నియంత్రిస్తోంది.
ఇప్పటివరకు ఇరుజట్ల ఫామ్, బలాబలాల గురించి చర్చించాం. కానీ, ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఆ రోజున మెరుగ్గా ప్రదర్శన చూపించే జట్టుకే గెలుపు లభిస్తుంది.
గత వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేసుకుంటే, అప్పటివరకు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వచ్చిన టీమ్‌ఇండియాను ఆసీస్ ఓడించింది. ఈసారి కూడా అలాంటి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రేలియా.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకోవాలంటే, టీమ్‌ఇండియా ముందు ఆసీస్ అడ్డంకిని అధిగమించాలి. ఒకవేళ భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, ఆసీస్‌పై విజయం సాధించేందుకు బలమైన అవకాశం ఉంటుంది.
గ్రూపు స్టేజిలో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ కి కాస్త డిఫ్రెండ్ గా సిద్ధం కావొచ్చు. ఎటూ దూబాయ్ పిచ్ లోనే ఆడుతుండటంతో భారీ స్కోర్లు వచ్చే అవకాశం లేదు. దీంతో రోహిత్ సేన న్యూజీలాండ్ జట్టుతో చేసిన నలుగురు స్పిన్నర్ల ప్రయోగాన్నికొనసాగిస్తుందా.. లేక ఇద్దరు సీమర్లు ముగ్గురు స్పిన్లర్లతో ముందుకు వెళ్తుందా చూడాలి. అయితే న్యూజీలాండ్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించడంతో పాటు అయిదు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. దీంతో వరుణ్ చక్రవర్తిని సెమీ ఫైనల్లో కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీమిండియా రాణా, షమీ, హార్దిక్, లతో పాటు అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జడేజాలతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఆస్ట్రేలియాను నిలువరించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ట్రావిస్ హెడ్, లబుషేన్ లాంటి ఆటగాళ్లు భారత్ వైపు కాస్త ఒత్తడికి క్రియేట్ చేసేట్టు కనిపిస్తున్నా.. స్పిన్ ధాటికి వాళ్లు పెద్దగా నిలకవపోవచ్చనే రీసెంట్ ఫాం, భారత స్పిన్ గణాంకాలను చూస్తే అర్థం అవుతోంది.