'2007ను మర్చిపోలేను కానీ..' టీమిండియా విజయోత్సవ పరేడ్ పై రోహిత్ శర్మ ఏమ‌న్నారంటే..?

By Mahesh RajamoniFirst Published Jul 6, 2024, 4:15 PM IST
Highlights

Team India: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీతో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టిన టీమిండియాకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ముంబైలో ఓపెన్ బ‌స్ విక్ట‌రీ ప‌రేడ్ త‌ర్వాత భార‌త జ‌ట్టును వాంఖ‌డే స్టేడియంలో బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మ‌నీతో సత్కరించింది.
 

Team India: టీ20 ప్రపంచకప్ 2024ను గెలుచుకుని ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు ప్ర‌ధాని మోడీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. ఇది పూర్తయిన వెంటనే దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో  కెప్టెన్ రోహిత్ సేనమెరైన్ డ్రైవ్‌లో ఓపెన్-బస్ విక్ట‌రీ పరేడ్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌సంద్రోహంతో నిండిపోయిన ఆ ప్రాంతం 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను భార‌త‌ జట్టు గెలిచిన అద్భుత క్ష‌ణాల‌ను మ‌రోసారి గుర్తుచేసింది. ఈ గ్రాండ్ సెలబ్రేషన్ గురించి రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మారాయ‌నీ, గొప్ప అనుభూతిని పంచాయ‌ని తెలిపారు.

"2007 ఒక భిన్నమైన అనుభూతి. మేము మధ్యాహ్నం విక్ట‌రీ ర్యాలీని ప్రారంభించాము..ఇప్పుడు సాయంత్రం జ‌ర‌గింది. నేను ఎప్ప‌టికీ 2007ని మర్చిపోలేను.. అది నా మొదటి ప్రపంచ కప్, కానీ ఇప్పుడు కొంచెం ప్రత్యేకమైనది.. ఎందుకంటే నేను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా గర్వకారణం. ఎంతో స్పెష‌ల్ గా.. పిచ్చిగానూ మారుతుంది' అని రోహిత్ అన్నారు. ఈ విష‌యాలు ప్ర‌స్తావించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అలాగే, ఢిల్లీలో ఘ‌నంగా స్వాగ‌తం అందుకున్న భార‌త జ‌ట్టు విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన‌డానికి ప్ర‌జ‌లు చూపిన ఆస‌క్తి.. త‌మ జ‌ట్టు ప‌ట్ల చూపిన ప్రేమాభిమానాలను రోహిత్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

Latest Videos

హార్దిక్ చేసిన ప‌నికి న‌వ్వాపుకోలేక పోయిన జ‌స్ప్రీత్ బుమ్రా ! వీడియో

"మీరు ఉత్సాహాన్ని.. ప్రేమ‌ను ఇలా చూపించారు. ఇది మనకే కాదు, మొత్తం దేశానికి కూడా ఎంత స‌గ‌ర్వంగా నిలిచే క్ష‌ణాలు.. దేశ ప్ర‌జ‌ల కోసం ఇలాంటిది ఏదైనా సాధించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నారు. 

 

When the nation jumped with joy and celebrated with their heroes 🇮🇳❤️ Captain shares his feeling of being part of the majestic victory parade 🥳 | pic.twitter.com/wVmU9nhT9f

— BCCI (@BCCI)

 

కాగా, ముంబైలో నిర్వ‌హించిన టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ విక్ట‌రీ ఓపెన్ బ‌స్ ప‌రేడ్ లో వేలాది మంది పాల్గొన్నారు. ఆ త‌ర్వాత వాంఖ‌డే జ‌రిగిన కార్య‌క్ర‌మం స‌మయంలో స్టేడియం అభిమానుల‌తో నిండిపోయింది. దాదాపు ఆరు గంట‌ల విక్ట‌రీ ప‌రేడ్ త‌ర్వాత ఆటగాళ్లు వాంఖ‌డే స్టేడియానికి చేరుకున్నారు. అక్క‌డ స్టేడియం ద‌ద్ద‌రిల్లే కరతాళ ధ్వనుల మధ్య బీసీసీఐ టీమిండియాను ఘ‌నంగా సన్మానించింది. రూ.125 కోట్ల చెక్ ను అందించింది. ఈ విజ‌యంలో ఆట‌గాళ్లు అంద‌రూ త‌మ‌దైన పాత్ర పోషించార‌ని టీమిండియా ఆటగాళ్లు, జ‌ట్టు ఇత‌ర సిబ్బందిపై రోహిత్ శ‌ర్మ ప్ర‌శంస‌లు కురిపించారు. జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా నిలిచిన భార‌తీయులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

 

Watch out for those moves 🕺🏻

Wankhede was a vibe last night 🥳 | | pic.twitter.com/hRBTcu9bXc

— BCCI (@BCCI)

 

6, 6, 6... రాహుల్ ద్రవిడ్ బ్యాట్ పవర్ కు ఇంగ్లాండ్ బౌలర్‌కు దిమ్మదిరిగిపోయింది.. ! 

click me!