కోహ్లీ టెస్టు సెంచరీ చేస్తే తలనీలాలు ఇస్తా స్వామీ.. శ్రీవారి సన్నిధిలో మొక్కు చెల్లించిన విరాట్ వీరాభిమాని...

Published : Mar 16, 2023, 10:31 AM IST
కోహ్లీ టెస్టు సెంచరీ చేస్తే తలనీలాలు ఇస్తా స్వామీ.. శ్రీవారి సన్నిధిలో మొక్కు చెల్లించిన విరాట్ వీరాభిమాని...

సారాంశం

మూడున్నరేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ... విరాట్ సెంచరీని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులు...

తన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ వచ్చేదాకా పెళ్లి చేసుకోనని ఓ అభిమాని, మూడేళ్లుగా వివాహాన్ని వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో సినిమా గురించి అప్‌డేట్ రావడం లేదనే మనస్థాపంతో ప్రాణాలే తీసుకున్నాడు ఓ ప్రభాస్ వీరాభిమాని. సినిమా హీరోలకే కాదు, క్రికెటర్లకు కూడా ఇలాంటి అభిమానులు ఉంటారు. మహేంద్ర సింగ్ ధోనీ మీద అభిమానంతో తన ఇంటినే సీఎస్‌కే రంగులతో నింపేశాడు ఓ తమిళ తంబీ. ఈ విషయంలో విరాట్ కోహ్లీ అభిమానులు కాస్త ముందే ఉన్నారు...

ప్రస్తుత తరంలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లికి ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు...

మూడేళ్ల విరామం తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ... మూడు ఫార్మాట్లలోనూ మళ్లీ మునుపటి రేంజ్‌లో పరుగుల వరద పారించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో మొట్టమొదటి టీ20 సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, వన్డేల్లో మూడు సెంచరీలు బాది... మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో సెంచరీ బాదాడు విరాట్ కోహ్లీ...

మూడున్నరేళ్లుగా టెస్టు సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. 1205 రోజుల తర్వాత చేసిన శతకం ఇది. ఈ సెంచరీని అభిమానులు వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన విరాట్ కోహ్లీ అభిమానులు, తమ ఫెవరెట్ క్రికెటర్... టెస్టు సెంచరీ చేసిన సందర్భంగా నిరుపేద కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేశారు..

విరాట్ కోహ్లీ 28వ టెస్టు సెంచరీ చేసిన సందర్భంగా అని రాసి ఉన్న ఆహారపు ప్యాకెట్లను రోడ్లపై పడుకునే నిర్భాగ్యులకు అందించారు. మరో కోహ్లీ వీరాభిమాని చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా అనారోగ్యం నుంచి కోలుకుంటే లేదా పరీక్ష పాస్ అయితేనే, అప్పులు తీరితేనో గుడికి వచ్చి తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటారు...

కానీ హైదరాబాద్‌కి చెందిన ఓ అభిమాని, విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీ చేస్తే తిరుమల తిరుపతి దేవాలయానికి వెళ్లి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత తన మొక్కు తీర్చుకున్నాడు ఆ వీరాభిమాని. గుండు చేయించుకుని, విరాట్‌ మీద తన కున్న అభిమానాన్ని చాటుకున్నాడు...

అహ్మదాబాద్ టెస్టులో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 10వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మూడు ఫార్మాట్లలోనూ 10కి పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... వన్డేల్లో 38 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించాడు. టెస్టుల్లో 10వ సారి ఈ ఫీట్ సాధించి, టాప్‌లో నిలిచాడు..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !