
క్రికెట్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ డేవిడ్ వార్నర్ సుపరిచితమే. పేరుకు ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా... ఐపీఎల్ ద్వారా ఇక్కడి ప్రజలకు చేరువయ్యారు. అంతేకాదు... ఇండియన్ సినిమాల్లో హీరోలను ఇమిటేట్ చేస్తూ... ముఖ్యంగా తెలుగు హీరోల పాటలు, డైలాగ్ లకు రీల్స్ చేసి ఆయన మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. వార్నర్ ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఆయన ఎప్పుడూ అందరికన్నా భిన్నంగా ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఆయన... ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా... దీనికి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కూడా ఫిదా అయిపోయారు.
త్వరలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం వార్నర్... భారత్ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడాడు. ముంబయిలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే.. వార్నర్ కూడా వెళ్లి వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఈ వీడియోని ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సైలెంట్ గా ఉన్న వీధిదొరికింది అంటూ.. ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు.
ఈ వీడియోని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కి తెగ నచ్చేయడంతో ఆయన లైక్ చేశారు. కాగా... నెటిజన్లు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వార్నర్ ని ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.