ఎన్ని రన్స్ చేశావ్.. జిమ్మి పేరుతో గెలికిన బెయిర్‌ స్టో ! ఒక్క మాటతో పరువు తీసిన గిల్‌.. వైరల్ వీడియో

By Mahesh Rajamoni  |  First Published Mar 12, 2024, 10:20 AM IST

Gill and Bairstow's sledging: ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన చివ‌రి మ్యాచ్ లో మూడో రోజు మైదానంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్, ఇంగ్లాండ్ స్టార్ జానీ బెయిర్ స్టో మధ్య స్లెడ్జింగ్ వార్ జ‌రిగింది. ఊరుకుండ‌క అన‌వ‌స‌రంగా గెలికిన బెయిర్ స్టోకు గిల్ ఇచ్చిప‌డేశాడు.
 


Shubman Gill and Jonny Bairstow's sledging battle: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు భారత్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంచి ఉత్సాహంతో సాగిన ఈ సిరీస్ లో భారత్-ఇంగ్లాండ్ క్రికెటర్లు తీవ్రమైన స్లెడ్జింగ్ ఎపిసోడ్‌లో చిక్కుకోవడం ఇదే తొలిసారి. 5వ టెస్టులో మంచి ఊపులో ఉన్న టీమిండియా గెలుపు దిశ‌గా సాగుతున్న స‌మ‌యంలో స‌హ‌నం కోల్పోయిన బెయిర్ స్టో అన‌వ‌స‌రంగా శుభ్‌మన్ గిల్ గెలికి ప‌రువు తీసుకున్నాడు. త‌న 100వ టెస్టు ఆడుతున్న‌ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ ను గట్టెక్కించేందుకు జో రూట్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు శనివారం ఉదయం సెషన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

జానీ బెయిర్‌స్టో-శుభమన్ గిల్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం

Latest Videos

వెన్నునొప్పి కార‌ణంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత్‌కు నాయకత్వం వ‌హించాడు జస్ప్రీత్ బుమ్రా. రవిచంద్రన్ అశ్విన్ అప్పటికే భారత్‌ను కమాండింగ్ స్థానంలో ఉంచిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ హీరో కుల్దీప్ యాదవ్‌కు బంతిని విసిరాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో కుల్‌దీప్‌ తన తొలి బంతిని బౌలింగ్‌ చేసేందుకు సన్నద్ధమవుతుండగా, స్లిప్‌ కార్డన్‌లో నిలబడిన గిల్‌పై బెయిర్‌స్టోను నోరుపారేసుకున్నాడు. ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో బెయిర్ స్టో వ‌రుస బంతుల్లో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ ఆండ‌ర్స‌న్ ఈ మ్యాచ్ 2వ రోజు గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం గురించి బెయిర్‌స్టో ప్ర‌స్తావించాడు.

ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్.. ఐపీఎల్ కు సిద్ధంగా రిషబ్ పంత్ !

వ‌రుస బౌండ‌రీల త‌ర్వాత త‌న‌ను ఆప‌లేరంటూ చూస్తూ.. వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌ను ఏదో అన్నాడు. ఆ త‌ర్వాత శుభ్ మ‌న్ గిల్‌ను  గెలికాడు. "జిమ్మి(జెమ్స్‌ అండర్సన్‌)ను ఏం అన్నావ్‌.. నిన్ను క్లీన్ బౌల్డ్ చేశాడంటూ" వెటకారం చూపించాడు.  అన‌వ‌స‌రంగా గెలుకున్న బెయిర్ స్టోకు దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు గిల్.. "సో వాట్‌.. అప్పటికే నేను సెంచరీ కొట్టేశాను. అయినా నువ్వు ఇక్క‌డ ఎన్ని సెంచరీలు కొట్టావ్.." అంటూ బెయిర్ స్టో ప‌రువు తీసేశాడు. 

ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. గిల్, బెయిర్‌స్టో, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ మధ్య సంభాషణ ఎలా సాగిందో ఇక్కడ ఉంది.. 

జానీ బెయిర్‌స్టో: "రిటైర్ కావడం లేదా డ్రాప్ అవ్వడం గురించి మీరు జిమ్మీ (అండర్సన్)కి ఏమి చెప్పారు? ఆ త‌ర్వాతే మిమ్మల్ని క్లీన్ బౌల్డ్ చేసి బయటకు పంపించాడు?"

శుభ్‌మాన్ గిల్: "సో వాట్..  నేను అప్ప‌టికే 100 ప‌రుగులు దాటేశాను. సెంచ‌రీ త‌ర్వ‌తే  అతను నన్ను అవుట్ చేశాడు. అయితే, మీరు ఇక్కడ ఎన్ని సెంచ‌రీలు (పరుగులు) చేశారు?"

జానీ బెయిర్‌స్టో: "బంతి స్వింగ్ అయినప్పుడు మీరు ఎన్ని ప‌రుగులు చేసారు?"

ధృవ్ జురెల్: "జానీ భాయ్ ఈజీ!"

సర్ఫరాజ్ ఖాన్: " థోడే సే రన్స్ క్యా బనా దియా, జ్యాదా ఉచల్ రహా హై (కొన్ని ప‌రుగులు చేశాడు లేదో ఎగిరిప‌డుతున్నాడు.. )"

NZ vs AUS: గాల్లోకి పక్షిలా ఎగురుతూ స్టన్నింగ్ క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ వీడియో వైర‌ల్ !

అయితే, 2వ రోజు ఆట ముగిసిన తర్వాత అండర్సన్‌తో అతని పరస్పర చర్య గురించి అడిగినప్పుడు, గిల్ దానిని రహస్యంగా ఉంచాలనుకుంటున్న‌ట్టు చెప్పాడు. "మా ఇద్దరి మధ్య ఆ చాట్‌ను కొనసాగించడం మంచిదని నేను భావిస్తున్నాను" అని శుభ్‌మాన్ మ్యాచ్ తర్వాత బ్రాడ్‌కాస్టర్‌లతో అన్నారు. అయితే స్లెడ్జింగ్ ఎపిసోడ్ బెయిర్‌స్టో సరైన రీతిలో ముగియలేదు. మూడు బంతుల తర్వాత, కుల్దీప్ దెబ్బ‌కొట్టి పెవిలియ‌న్ కు పంపాడు. మ‌ళ్లీ ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రౌండ్ వీడుతూ గిల్ ను ఏదో అన్నాడు. దానికి కూడా గిల్ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టు క‌నిపించింది. కాగా, ఈ మ్యాచ్ లో భార‌త్ ఇన్నింగ్ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసి 4-1తో విజ‌యం సాధించింది.

భార‌త్ దెబ్బ‌కు ఇంగ్లాండ్‌కు దిమ్మ‌దిరిగిపోయింది.. బాజ్ బాల్ మార్పులు చేస్తున్న మెకల్లమ్ !

click me!