ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్.. ఐపీఎల్ కు సిద్ధంగా రిషబ్ పంత్ !

By Mahesh RajamoniFirst Published Mar 11, 2024, 11:49 AM IST
Highlights

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పాల్గొనేందుకు రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడు.  ఈ క్ర‌మంలోనే ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ రంగంలోకి దిగుతాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 

IPL 2024: ఘోర కారు ప్ర‌మాదం త‌ర్వాత చాలా కాలంపాటు క్రికెట్ దూరంగా ఉన్న రిష‌బ్ పంత్ ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) తో మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడ‌ని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఐపీఎల్ 2024లో సత్తా చాటేందుకు రంగంలోకి దిగుతున్నాడు. రెండు రోజుల క్రితం పంత్ కు ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజా మీడియా నివేదిక‌ల ప్రకారం పంత్ కు గత వారమే ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ సర్టిఫికేట్ లభించింది.

2022 డిసెంబర్ లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రిష‌బ్ పంత్ ఆటకు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మ‌న్ ఎన్సీఏలో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండి పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ 2024లో పంత్ పాల్గొనడంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'రిషబ్ తిరిగి ఫిట్ గా రావడం మాకు పెద్ద అదనపు అంశం. అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడు కాబట్టి అతను పూర్తి సీజన్ లో ఆడతాడని మేము ఆశిస్తున్నాము. అన్ని ఫార్మాట్లలో రాణించిన కొందరు దేశవాళీ ఆటగాళ్లపై మేం పనిచేశాం. కానీ రిషబ్ పంత్ చాలా ముఖ్యం' అని గంగూలీ పేర్కొన్నాడు.

WPL 2024: ఒక్క పరుగుతో ఓటమి.. స్మృతి మంధాన హార్ట్ బ్రేకింగ్ రియాక్ష‌న్.. వైర‌ల్ వీడియో !

అతను ఫిట్ గా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నాడనీ, అందుకే ఎన్సీఏ అతడిని క్లియర్ చేస్తుందని తెలిపాడు. చాలా సుదీర్ఘమైన కెరీర్ ఉంద‌న్నాడు. ఎన్సీఏ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అతను శిబిరంలో చేరనున్నాడనీ, మ్యాచ్ ఆడిన త‌ర్వాత పూర్తి అంచ‌నాలు, విష‌యాలు చెప్ప‌గ‌ల‌మ‌ని అన్నారు. టోర్నీ తొలి అర్ధభాగంలో పంత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడని ఊహాగానాలు చెలరేగాయి, అయితే పంత్ జట్టుకు కూడా కెప్టెన్ గా ఉంటాడని ఢిల్లీ క్యాపిట‌ల్స్ స‌హ యజమాని పార్థ్ జిందాల్ చెప్పారు. కాగా, మార్చి 23న మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ లో తలపడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, యశ్ ధూల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్వాల్, అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, హ్యారీ బ్రూక్, ట్రిస్టాన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, జై రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్.

Chanakya: చాణక్యుడి ఇమేజ్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ధోనీ కనిపిస్తున్నాడే?!

click me!