England - Brendon McCullum: బాజ్ బాల్ గేమ్ తో భారత్ తో టెస్టు సిరీస్ ను గెలుచుకోవాలని చూసిన ఇంగ్లాండ్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది యంగ్ ఇండియా. దీంతో బాజ్ బాల్ పై విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీల నుంచి వస్తున్న హాట్ కామెంట్స్ తో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bazball - Brendon McCullum : ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో జరగ్గా ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్ లలో భారత్ అద్భుతమైన ఆటతో విజయం సాధించి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్ లలో టీమిండియా టాప్ లో ఉంది. అలాగే, 2025 టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ టెస్టు సిరీస్ కు ముందు 'బాజ్ బాల్' గేమ్ తో ఇంగ్లాండ్ విజయవంతమైన జట్టుగా వరుస సిరీస్ లను గెలుచుకుంది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో బాజ్ బాల్ గేమ్ లో భారత్ ను ఓడిస్తామని ఇంగ్లాండ్ ధీమాతో టెస్టు సిరీస్ ను ప్రారంభించింది. అనూహ్యంగా తొలి టెస్టులో భారత్ ఓడింది. కానీ, ఆ తర్వాత తమదైన ఆటతో సీనియర్ ప్లేయర్లు దూరమైనా.. యంగ్ ప్లేయర్లతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాల్, బ్యాట్ తో రాణించి ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. బెన్ స్టోక్స్ - మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లాండ్ తొలిసారి ఓ సిరీస్‌లో ఓటమి చవిచూసింది. దీంతో బాజ్ బాల్ పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్.. ఐపీఎల్ కు సిద్ధంగా రిషబ్ పంత్ !
మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ బాజ్ బాల్ గేమ్ పై విమర్శలు చేస్తున్నారు. బేస్ బాల్ విధానాన్ని కట్టడి చేసి పరిస్థితులకు అనుగుణంగా ఆడి ముందుకు వెళ్లే మార్గం చూడాలని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శించాడు. ఇదే తరహాలో మాజీ దిగ్గజ క్రికెటర్లు కామెంట్స్ చేశారు. దీంతో బ్రెండన్ మెకల్లమ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో తమ కంటే మెరుగ్గా ఆడినందుకు భారత్‌ను ప్రశంసలు కురిపించాడు. దూకుడుగా ఆడటం ద్వారా భారత సిరీస్‌ను గెలవలేమని తాను గ్రహించాననీ, మరికొద్ది నెలల్లో బాజ్ బాల్‌పై తన విధానంలో అవసరమైన మార్పులు తీసుకొస్తామని మెకల్లమ్ ప్రకటించాడు.
"భారత్ ఆడిన విధానానికి అభినందనలు. వారు ఎల్లప్పుడూ చాలా ఒత్తిడిలో ఉన్నారు ఎందుకంటే వారిపై చాలా అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, వారు ఆ ముఖ్యమైన క్షణాలను చక్కగా నిర్వహించి, టీమిండియా ఎంత మంచి స్థితిలో ఉందో చూపించారు. నిజానికి, మేము ఆడాలనుకున్న శైలిని వారు అధిగమించారు. ఇది మనం ఆడే విధానంలో కొంచెం వెనక్కి తగ్గింది. కాబట్టి మనం మారాలి. ఈ సిరీస్‌లో చాలా నేర్చుకున్నాం. భారత్ మనల్ని ఔట్ చేసింది. వారు నిజంగా మా కంటే మెరుగ్గా ఆడారు. రాబోయే సిరీస్ లలో బాజ్ బాల్ విధానంలో మార్పులు చేస్తాం" అని మెకల్లమ్ పేర్కొన్నాడు.
WPL 2024: ఒక్క పరుగుతో ఓటమి.. స్మృతి మంధాన హార్ట్ బ్రేకింగ్ రియాక్షన్.. వైరల్ వీడియో !
వచ్చే వేసవి నాటికి తమ బాజ్ బాల్ విధానంలో మార్పులు తీసుకువస్తామనీ, సవరించిన సంస్కరణను అభివృద్ధి చేస్తామని మెకల్లమ్ చెప్పాడు. ప్రస్తుత బాజ్ బాల్ విధానంలో తాము గత 2 సంవత్సరాలలో బాగా ఆడామని చెప్పాడు. అనేక సిరీస్ లను గెలుచుకోవడంతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్‌లోని ప్రతిభను వెలికి తీశామని చెప్పాడు.
NZ vs AUS: గాల్లోకి పక్షిలా ఎగురుతూ స్టన్నింగ్ క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ వీడియో వైరల్ !