బౌన్సీ వికెట్లపై గెలువలేదా: కోహ్లీ సేనపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 28, 2020, 10:54 AM IST
బౌన్సీ వికెట్లపై గెలువలేదా: కోహ్లీ సేనపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

న్యూజిలాండ్ పై టీమిండియా పరాజయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌన్స్ బంతులకు భయపడుతామంటే అందులో అర్థం లేదని ఆయన అన్నారు. బౌన్సీ వికెట్లపై మనం గతంలో గెలిచామని కపిల్ దేవ్ అన్నారు.

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పై టీమిండియా పరాజయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు బౌన్సీ వికెట్లపై మనం గెలువలేదా ఆయన ప్రశ్నించారు.  పెర్త్ లేదా మెల్బోర్న్ లేదా దర్బన్ ల్లో గెలువలేదా అని ఆయన అడిగారు. ఇంతకు ముందు మనం గెలిచామని, షార్ట్ బంతులకు భయపడుతామని ఎవరైనా అంటే అందులో అర్థం లేదని ఆయన అన్నారు. 

వారంతా ప్రొఫెషనల్స్ అని, వారికి గేమ్ అర్థమవుతుందని, వచ్చే టెస్టు మ్యాచులో మరింత కఠినంగా ముందుకు రావాల్సి ఉంటుందని, లేదంటే న్యూజిలాండ్ ప్రశంసలు పొందేలా వదిలేయాల్సిందేనని ఆయన అన్నారు. 

Also Read: ధోనీ దేశం కోసం చాలా చేశాడు.. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

న్యూజిలాండ్ పై జరిగిన తొలి టెస్టుకు కెఎల్ రాహుల్ ను తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దానికి టీమ్ మేనేజ్ మెంట్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. గతంతో పోలిస్తే చాలా తేడా కనిపిస్తోందని, సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసినప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ అన్నారు. ఐసిసి టీ20 మహిళ ప్రపంచ కప్ సెమీ ఫైనల్లోకి చేరుకున్న టీమిండియా జట్టును ఆయన ప్రశంసించారు. భారత మహిళలు బాగా ఆడుతున్నారని, మహిళల ప్రదర్శనను కూడా పట్టించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 

Also read: పిచ్ రోలర్ డ్రైవ్ చేస్తూ ఎంఎస్ ధోనీ: వీడియో వైరల్

అమ్మాయిలకు అన్ని వసతులు కల్పించినందుకు, వారికి అవసరమైనవి ఇచ్చినందుకు తాను బీసీసీఐని గౌరవిస్తున్నానని కపిల్ దేవ్ అన్నారు. 15 ఏళ్ల క్రిందటితో పోలిస్తే ఇప్పుడు మన అమ్మాయిలు మంచి ప్రదర్శన చేస్తున్నారని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !