కోహ్లీపై భీకరంగా దాడి చేస్తాం, ఇలా చేస్తాం: టామ్ లాథమ్

By telugu teamFirst Published Feb 28, 2020, 8:33 AM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ అన్నాడు. విరాట్ కోహ్లీపై ఆఫ్ సైడ్ బంతులతో భీకరంగా దాడి చేస్తామని లాథమ్ చెప్పాడు.

క్రైస్ట్ చర్చ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అడ్డుకునేందుకు తాము సిద్ధపడినట్లు న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ చెప్పారు. రేపటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు. రెండో టెస్టులో పుంజుకునేందుకు విరాట్ కోహ్లీ కచ్చితంగా ప్రయత్నిస్తాడని, అయితే, అతన్ని అడ్డుకునేందుకు ఆఫ్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బంతులు వేసి దాడి చేస్తామని లాథమ్ చెప్పాడు. 

తొలి టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అతను 2, 19 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగానే తాము సిద్ధంగా ఉంటామని, కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అని, ప్రపంచం నెంబర్ వన్ ర్యాంకులో చాలా రోజులు అతని కొనసాగడం అతని నిలకడైన బ్యాటింగే కారణమని లాథమ్ అన్నాడు.

Also Read: కోహ్లీ బ్యాటింగ్ ఫట్: కివీస్ బౌలర్ల ఉచ్చులో ప్రతిసారీ ఇలాగే...

విభిన్నమైన పరిస్థితుల్లో అన్ని దేశాల్లోనూ విరాట్ కోహ్లీ రాణించాడని, క్రైస్ట్ చర్చ్ లో పరిస్థితులు స్వింగ్ కు అనుకూలిస్తే ఆఫ్ సైడ్ బంతులతో తాము భయంకరంగా దాడి చేస్తామని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలతో కూడిన భారత బౌలింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని ఆయన చెప్పాడు.

తొలి టెస్టు మ్యాచులో తాము భారత బౌలింగ్ ను బాగా ఎదుర్కున్నామని ఆయన చెప్పాడు. బుమ్రా, షమీ అంటే తమకు ఆందోళనగానే ఉందని, వాళ్లు కచ్చితంగా దాడి చేస్తారని, అందుకే బాగా ఆడితేనే తమకు అవకాశాలుంటాయని లాథమ్ అన్నాడు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి భాగస్వామ్యాలు నెలకొల్పాలని, నీల్ వాగ్నర్ అద్భుతమైన పేసర్ అని, అతను జట్టులో చేరడంతో తమ బలం పెరిగిందని లాథమ్ అన్నాడు. 

Also Read: టీం ఇండియా పరిస్థితి: సాకు టాస్.... ఆడలేక మద్దెల ఓడడమేనా

బౌన్స్ కు సహకరించే హెగ్లే ఓవల్ మైదానంలో నీల్ వాగ్నర్ ఎంతో కీలకమని, కాస్తా పొట్టిగా ఉండడంతో బ్యాట్స్ మెన్ కు అతన్ని ఆడడం కష్టమవుతుందని, పచ్చిక పిచ్ కాబట్టి ఆటలో తొలి రోజే కీలకమని ఆయన చెప్పాడు తాము అక్కడ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఓడిపోయామని, తమకు ఇష్టమైన మైదానాల్లో ఇది ఒక్కటని ఆయన అన్నాడు.

click me!