
hardik pandya no look six: హార్దిక్ పాండ్యా అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ పై భారత జట్టు మరో విక్టరీ అందుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. జనవరి 31న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని నాల్గవ టీ20లో హార్దిక్ పాండ్యా అవసరమైన సమయంలో అర్ధ సెంచరీ సాధించాడు.
ఇంగ్లాండ్ పేసర్ సాకిబ్ మహ్మూద్ రెండవ ఓవర్లోనే భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. తన బౌలింగ్ లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లను పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ 79/5 స్కోరుతో కష్టాల్లో ఉండగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి దిగాడు. అయితే, ఎప్పటిలాగే, హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి, ఇంగ్లాండ్ బౌలర్లను దుమ్ము దులిపాడు. తన పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో జట్టు 150 పరుగుల మార్కును దాటడానికి సహాయం చేశాడు.
ఇంకా చదవండి: saqib mahmood: వికెట్, వికెట్, వికెట్.. ఒకే ఓవర్‌లో టీమిండియాను దెబ్బకొట్టిన బౌలర్
ప్రస్తుతం జరుగుతున్న T20I సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తన మొదటి అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. 31 ఏళ్ల అతను 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18వ ఓవర్ మొదటి బంతికి జామీ ఓవర్టన్‌ను ఎదుర్కొన్నాడు. పాండ్యా తన ఫ్రంట్ లెగ్‌ను క్లియర్ చేసి.. బంతిని చూడకుండా లాంగ్-ఆన్‌పై సిక్సర్‌ను కొట్టాడు.
హార్దిక్ పాండ్యా 'నో లుక్' సిక్స్ అతని అప్రయత్నమైన శక్తిని ప్రదర్శించడమే కాకుండా హాఫ్ సెంచరీకి సాయం చేసింది. దీంతో డగౌట్‌లో అతని సహచరులు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు స్టేడియంలోని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను BCCI తన X హ్యాండిల్‌లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆరంభం నుంచే భారత్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే మూడు వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లు వచ్చిన వెంటనే మళ్లీ పెవిలియన్ బాటపట్టారు. అయితే, వీరి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రింకూ సింగ్ 30 పరుగులు, శివం దూబే 53, హార్దిక్ పాండ్యా 53 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
182 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించింది. 5 ఓవర్లలోనే 50 పరుగలు దాటింది. అయితే, 6వ ఓవర్ లో బెన్ డకెట్ ఔట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో హ్యారీ బ్రూక్ ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించి హాఫ్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ భారత బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులకే ఆలౌట్ అయింది. ఫిల్ సాల్ట్ 23 పరుగులు, బెన్ డకెట్ 39 పరుగులు, బ్రూక్ 51 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నారు.
ఇంకా చదవండి: Ranji Trophy: అయ్యో విరాట్ కోహ్లీ.. ఇలా జరిగిందేంటి !