Shubman Gill: టీమిండియా యంగ్ క్రికెటర్ పై మరో స్టార్ హీరోయిన్ మనసు పారేసుకున్నారు. గ్రౌండ్ లో తన ఆటతో వార్తల్లో నిలిచే గిల్.. రిలేషన్ షిప్ విషయాల్లోనూ చాలా సార్లు నెట్టింట ట్రెండ్ అయ్యాడు. సారా టెండూల్కర్ తో డేటింగ్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Shubman Gill: హర్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లడంతో అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయ్యాడు యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్. భారీ అంచనాలున్న సమయంలో గిల్ ఐపీఎల్ లో పెద్దగా రాణించకపోవడంతో వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో రిజర్వు ప్లేయర్ ఉండటం కూడా హాట్ టాపిక్ అయింది. అయితే, టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గిల్ కెప్టెన్సీలో భారత జట్టు జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను గెలుచుకుంది. ఇలా క్రికెట్ అంశాలతోనే కాకుండా గిల్ చాలా సార్లు తన రిలేషన్ షిప్ విషయాలతో వార్తల్లో నిలిచాడు. మరోసారి తన డేటింగ్ విషయంతో హాట్ టాపిక్ గా మారాడు.
2023 ఐపీఎల్ సీజన్ సమయంలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుభ్‌మన్ గిల్ డేటింట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో వీరి రిలేషన్ షిప్ ట్రెండ్ లో కొనసాగింది. అందరూ వీరిద్దరి డేటింగ్ నిజమేనని భావించారు. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ తెరమీదకు వచ్చారు. ఈ బాలీవుడ్ హీరోయిన్ తో శుభ్‌మన్ గిల్ రిలేషన్ నడుపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ రూమర్ల క్రమంలో మరో బాలీవుడ్ హీరోయిన్ గిల్ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డేటింగ్ ను దాటేసి త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నారనే పోస్టులు వైరల్ గా మారాయి. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు అందాల బ్యూటీ రిధిమా పండిట్.
undefined
భారత్ ను టార్గెట్ చేశాడు.. చివరకు తన ముఖంపైనే ఉమ్మెసుకున్న పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
రిధిమా పండిట్, శుభ్ మన్ గిల్ లు ప్రేమలో ఉన్నారని పలు రిపోర్టులు వైరల్ గా మారాయి. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పేర్కొంటున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే గిల్ గానీ, రిధిమా పండిట్ గానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో ఇది నిజమేనని వార్తలు గుప్పుమన్నాయి. రిధిమా పండిట్ గురించి వార్తలు ట్రెండ్ లోకి రావడం, అమెకు వరుసగా అభినందనలు రావడంతో తాజాగా స్పందించారు. గిల్, తాను ఎలాంటి రిలేషన్ లో లేమని ప్రకటించారు. అసలు గిల్ తో తనకు పరిచయమే లేదనీ, అలాంటప్పుడు పెళ్లి ఎలా? అంటూ ఈ వార్తల్లో నిజం లేదని తెలిపారు.
కానీ, గిల్ చాలా చాలా క్యూట్ గా ఉంటారని చెప్పారు. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లను ప్రస్తావించిన రిధిమా పండిట్.. ఈ రూమర్లో నిజం లేదని, ఏమీ జరగడం లేదని తెలిపారు. శుభ్మన్తో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదనీ, తనకు గిల్ తెలియదన్నారు. అతను అద్భుతమైన క్రీడాకారుడుగా తెలుసుననీ, తమ మధ్య ఎలాంటి పరిచయం లేదన్నారు. నిజంగా ఒకవేళ గిల్-తాను కలుసుకుంటే ఈ విషయం చెప్పుకుని నవ్వుకుంటామని అన్నారు. గిల్ చాలా అందంగా ఉన్నాడు.. కానీ అందరూ అనుకున్నట్టుగా ఏమీ జరగడం లేదని కూడా చెప్పారు.
ఈ వార్తలు వైరల్ అయిన తర్వాత తనకు వరుసగా ఫోన్లు, మెసెజ్ లతో అభినందనలు వస్తున్నాయని రిధిమా తెలిపారు. ఈ వార్తల్లో నిజం లేదని చాలా మందికి చెప్పి చెప్పి ఫోన్ తో విసిగి పోవడంతోనే చివరకు తాను సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నానని రిధిమా వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేననీ, సింగిల్ గానే ఉన్నానని తెలిపారు. అయితే, కొత్త రిలేషన్ కోసం తాను సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఈ పుకార్ల కారణంగా ఇప్పుడు తన దగ్గరకు వచ్చేవారు ఉండరనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నట్టు రిధిమా చెప్పారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో మన తెలంగాణ గోల్డ్ మెడల్.. నిఖత్ జరీన్
As Per Sources, & to Tie-Knot in December 2024! There were rumours that they are dating but now it said that they will finally marry in December this year!
Congratulations to the couple pic.twitter.com/alRWI3xeh4