నటాషాతో నిశ్చితార్థం: హార్దిక్ పాండ్యా పేరెంట్స్ షాక్, కానీ...

pratap reddy   | Asianet News
Published : Jan 04, 2020, 03:54 PM ISTUpdated : Jan 04, 2020, 04:00 PM IST
నటాషాతో నిశ్చితార్థం: హార్దిక్ పాండ్యా పేరెంట్స్ షాక్, కానీ...

సారాంశం

నటాషాతో తన కుమారుడి నిశ్చితార్థంపై హార్డిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా షాకింగ్ విషయం బయటపెట్టారు. వారిద్దరి నిశ్చితార్థం గురించి తమకు తెలియదని ఆయన చెప్పారు. నటాషా మంచి అమ్మాయి అని కితాబు ఇచ్చారు.

హైదరాబాద్: టీవీ నటి నటాషా స్టాన్ కవిచ్ తో నిశ్చితార్థం ద్వారా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా నటాషా, హార్దిత్ పాండ్యా హార్దిక్ పాండ్యా, నటాషా దుబాయ్ వెళ్లి ఉంగరాలు మార్చుకని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం విషయం హార్దిక్ పాండ్యా తల్లిదండ్రులకు కూడా తెలియదు. 

పాండ్యా నిశ్చితార్థం విషయం ఆయన తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యం కలిగించింది. దానిపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకుంటారని తమకు తెలియదని ఆయన అన్నారు. 

Also read: హర్డిక్ పాండ్య, నటాశల లవ్ స్టోరీ ఇదే: అచ్చం ఫిదా సినిమా మాదిరిగా

నిశ్చితార్థం అయిన తర్వాతనే తమకు తెలిసిందని ఆయన చెప్పారు. వారిద్దరు ప్రేమించుకుంటున్నారనే విషయం మాత్రం తెలుసునని ఆయన చెప్పారు. నూతన సంవత్సర వేడుకలకు దుబాయ్ వెళ్తున్నట్లు మాత్రం తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.

నటాషా చాలా మంచి అమ్మాయి అని ఆయన అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులతో తమకు మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పారు. పలు సందర్భాల్లో నటాషాను తాము కలిశామని, వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలో నిర్ణయించలేదని చెప్పారు. త్వరలోనే ముహూర్తం పెడుతామని ఆయన అన్నారు.

Also Read: హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం: నటాషా మాజీ ప్రియుడి స్పందన ఇదీ..

PREV
click me!

Recommended Stories

అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ
IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !