Micheal Slater: గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అరెస్టు.. గతంలో ప్రధానిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 20, 2021, 1:34 PM IST
Highlights

Micheal Slater Arrested: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ గా ఉన్న మైకేల్ స్లేటర్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనమీద గృహహింస ఆరోపణలు నమోదయ్యాయి. 

గతంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ (Micheal slater) కు ఊహించని షాక్ తగిలింది.  బుధవారం ఉదయం అతడిని స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. సిడ్నీలోని తన నివాసంలో స్లేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆస్ట్రేలియా (Australia) మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

వారం రోజుల క్రితం పోలీసులకు అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా స్లేటర్ ను అరెస్టు చేసినట్టు సమాచారం. ‘అక్టోబర్ 12న గృహహింస (Domestic voilence)కు సంబంధించి మాకు ఫిర్యాదు అందించింది. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ సబర్బ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా స్లేటర్ ను బుధవారం ఉదయం 9 గంటలకు అరెస్టు చేశాం. ప్రస్తుతం స్లేటర్.. న్యూసౌత్ వేల్స్ లోని మాన్లీ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇదిలాఉండగా.. స్లేటర్ పై గృహహింస ఆరోపణలు చేసింది ఎవరు..? ఎందుకు చేశారు..? అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి: T20 Worldcup 2021: జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక.. థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్

Virat Kohli: కోహ్లి మరో ఘనత..దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరణ

T20 Worldcup: పాక్ మ్యాచ్ చూడటానికి బౌలర్లతో కలిసి వెళ్లిన రవిశాస్త్రి.. అతడిని కట్టడి చేయడానికేనా..?

స్లేటర్ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే కొత్త కాదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ (IPL 2021) సీజన్ సందర్భంగా కూడా అతడు.. ఆస్ట్రేలియా ప్రధాని (Australia prime minister) స్కాట్ మోరిసన్ (Scott morrison) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంలో క్వారంటైన్ నిబంధనల గురించి స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ‘మా ప్రభుత్వం ఆసీస్ ఆటగాళ్లపై భద్రత వహిస్తే  వాళ్లు మమ్మల్ని ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ ఇది అవమానకరం. డీయర్ పీఎం.. మాతో  ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీరు క్వారంటైన్ వ్యవస్థను ఎలా క్రమబద్దీకరిస్తారు..?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో గత కొద్దికాలంగా స్లేటర్ పనిచేస్తున్న ఛానల్ 7 యాజమాన్యం అతడిని కామెంటేటర్ ఉద్యోగం నుంచి తొలగించింది. 

54 ఏండ్ల స్లేటర్.. ఆస్ట్రేలియా తరఫున 74 టెస్టులు మ్యాచ్ లు ఆడాడు. 14 టెస్టు సెంచరీలతో 5,312 పరుగులు చేశాడు. 

click me!