T20 Worldcup : పాక్ తో తలపడే టీమిండియా ఇదేనన్న పార్థివ్ పటేల్..!

By telugu news teamFirst Published Oct 20, 2021, 9:38 AM IST
Highlights

పాక్ తో మ్యాచ్ ఆడే  టీమిండియాను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో... పాక్ తో మ్యాచ్ ఆడే టీమిండియా ఇలా ఉంటే బాగుంటుందంటూ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు

T20 World cup సమరం మొదలైంది. ఈ నెల 24వ తేదీన  భారత్ , పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఓ వైపు పలువురు ఈ మ్యాచ్ ని రద్దు  చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు బీసీసీఐ మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా.. పాక్ తో మ్యాచ్ ఆడే  టీమిండియాను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో... పాక్ తో మ్యాచ్ ఆడే టీమిండియా ఇలా ఉంటే బాగుంటుందంటూ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. ఆయన ప్రకారం.. టీమిండియా జట్టు లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

Also Read: T20 World cup: విజృంభించిన బంగ్లా పులులు.. టీ20 ప్రపంచకప్ లో బోణీ.. ఒమన్ కు నిరాశ

ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ లను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని పార్థివ్ అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్‌లో ఒక కార్యక్రమంలో పటేల్ మాట్లాడుతూ, "విరాట్ కి తన ప్లేయింగ్ ఎలెవన్ గురించి అవగాహన ఉంది.  ఏ కాంబినేషన్ తో వెళితే బాగుంటుందో కూడా కోహ్లీ ఐడియా ఉంది. అయితే.. జట్టులో భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ కి చోటు ఇస్తే బాగుంటుంది ’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. 

రోహిత్ శర్మ, కేల్ రాహుల్ నెంబర్ 3, విరాట్ కోహ్లీ నెంబర్ 4, సూర్యకుమార్, రిషబ్ పంత్ నంబర్ 5 పొజిషన్ లో జట్టులోకి దిగే అవకాశం ఉందని పార్థివ్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ను కూడా ఎంచుకుంటే జట్టుకు ఉపయోగకరమని అన్నాడు. రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, షమీ, బుమ్రా లతోపాటు భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ లను కూడా ఎంచుకుంటే మంచిదని సూచించాడు.

సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో  టీమాిండియా ఇంగ్లాండ్ తో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్  46 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో  KL రాహుల్ , కిషన్‌తో ఓపెనర్‌గా ఆడాడు  24 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

3 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 13 బంతుల్లో 11 పరుగులు నమోదు చేశాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా తొలుత  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జానీ బెయిర్‌స్టో 36 బంతుల్లో 49 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

మహ్మద్ షమీ మంచి బౌలింగ్ ఫామ్‌లో ఉన్నాడు, నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా , రాహుల్ చాహర్ ఒక్కొక్కటిగా వికెట్లు తీసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ వరుసగా 23 , 54 పరుగులు చేశారు.

189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 19 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రాహుల్, కిషన్ ,కోహ్లీ కాకుండా, పంత్ నం. 4 వద్ద బ్యాటింగ్ చేసాడు  14 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

నం .5 లో, సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు , హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 12 పరుగులు చేసి 6 వ స్థానంలో నిలిచాడు.

click me!