T20 Worldcup 2021: జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక.. థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్

By team teluguFirst Published Oct 20, 2021, 12:54 PM IST
Highlights

Scotland Jersey Designer: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో  భాగంగా జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ లలో స్కాట్లాండ్ నిలకడైన ప్రదర్శనతో సూపర్-12 దిశగా సాగుతున్నది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup 2021)లో స్కాట్లాండ్ (Scotland) జట్టు అంచనాలు మించి రాణిస్తున్నది. క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ లలో ఆ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసుకుని  సూపర్-12 (Super-12)  దిశగా అడుగులేస్తున్నది.  గ్రూప్ స్టేజీలో మరో మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు అర్హత రౌండ్ లలో పాసైనట్టే. కాగా, పొట్టి ప్రపంచకప్ (T20 World cup) లో కొత్త జెర్సీతో అదరగొడుతున్న స్కాట్లాండ్ (Scotland new jersey).. ఆ జెర్సీని రూపొందించిన డిజైనర్ ను  ప్రపంచానికి పరిచయం చేసింది. 

స్కాట్లాండ్ లోని హడింగ్టన్ కు చెందిన 12 ఏండ్ల బాలిక రెబెక డౌనీ (Rebecca Downie).. స్కాట్లాండ్ కిట్ డిజైనర్. స్కూల్ లో చదువుకుంటూనే  జాతీయ జట్టుకు జెర్సీని రూపొందించడం గమనార్హం.  ఈ విషయాన్ని స్వయంగా స్కాట్లాండ్ క్రికెట్ జట్టే (Cricket scotland) ట్విట్టర్ లో తెలిపింది.  బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన తొలి మ్యాచ్ ను రెబెక టీవీలో వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను స్కాట్లాండ్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. 

 

Scotland's kit designer 👇

12 year-old Rebecca Downie from Haddington 👋

She was following our first game on TV, proudly sporting the shirt she designed herself 👏

Thank you again Rebecca! 🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿 | 🟣 pic.twitter.com/dXZhf5CvFD

— Cricket Scotland (@CricketScotland)

బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా రెబెక టీవీ చూడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆమె మా తొలి గేమ్ ను ఫాలో అవుతున్నది. తాను రూపొందించిన జెర్సీకి మద్దతు పలుకుతన్నది. మరొక్కసారి కృతజ్ఞతలు రెబెక..’ అంటూ క్రికెట్ స్కాట్లాండ్ ట్వీట్ లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Virender Sehwag: 43వ పడిలోకి అడుగిడుతున్న నజఫ్గడ్ నవాబ్.. సెహ్వాగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

టీ20 లలో దీపక్ చాహర్ రికార్డు సమం చేసిన ఉగాండా బౌలర్.. అతడూ భారత సంతతి వ్యక్తే.. 

ఇదిలాఉండగా.. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన  తొలి మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించిన ..  మంగళవారం పపువా న్యూ గినియా (Papua New Guinea) ను కూడా చిత్తు చేసింది. తొలి  మ్యాచ్ లో క్రిస్ గ్రీవ్స్ (Chris Greaves) ఆల్ రౌండ్ ప్రదర్శన ఆకట్టుకోగా.. రెండో మ్యాచ్ లో రిచి బెరింగ్టన్ (berrington) సూపర్ బ్యాటింగ్ తో పపువా న్యూ గినియా ఎదుట 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యఛేధనలో పీఎన్జీ 148 పరుగులే చేయగలిగింది. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డెవీ నాలుగు వికెట్లతో చెలరేగాడు. 

click me!