Delhi Capitals : రికీ పాంటింగ్ కు షాకిచ్చిన గంగూలీ టీమ్..

By Mahesh RajamoniFirst Published Jul 14, 2024, 7:51 PM IST
Highlights

Delhi Capitals : ఆస్ట్రేటియా క్రికెట్ దిగ్గ‌జం, లెజెండ‌రీ ప్లేయ‌ర్ రికీ పాంటింగ్ ప్ర‌ధాన కోచ్ గా ఉన్న స‌మ‌యంలో  కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 2020లో ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించి రన్నరప్‌గా నిలిచింది.
 

Delhi Capitals - Ricky Ponting : జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐపీఎల్ టైటిల్ అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంది. ఐపీఎల్ 2024 లో రిష‌బ్ పంత్ కెప్టెన్సీలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది కానీ, ఆశించిన ఫ‌లితాలు రాలేదు. దీంతో ఆ జ‌ట్టు యాజ‌మాన్యం రాబోయే సీజ‌న్ కు ముందు కీల‌క మార్పులు చేస్తోంది. ఐపీఎల్ టైటిల్ కరువును ముగించడంలో రికీ పాంటిగ్ నాయ‌క‌త్వంలోని ఢిల్లీ టీమ్ విఫ‌లం కావ‌డంతో 7 సంవత్సరాల తర్వాత ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కు షాకిచ్చింది. ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వి నుంచి రికీ పాంటింగ్ ను తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. పాంటింగ్ తొల‌గింపుతో ప్రస్తుత జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తదుపరి సీజన్‌లో ప్రధాన కోచ్‌గా పనిచేసే అవ‌కాశాలున్నాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చెప్పిందంటే..? 

Latest Videos

ఢిల్లీ క్యాపిటల్స్ సోష‌ల్ మీడియా వేదిక 'ఎక్స్' లో  త‌మ ప్రధాన కోచ్‌గా జ‌ట్టు ఎదుగుద‌ల‌లో చేసిన కృషి చెప్ప‌లేనిదనీ, ఈ నిర్ణ‌యాన్ని మాటల్లో చెప్పడం త‌మ‌కు చాలా కష్టంగానే ఉంద‌ని తెలిపింది. శ్రద్ధ, నిబద్ధత, అభిరుచి, కృషిని జట్టుకు చూపించార‌నీ, ఏడేళ్ల పాటు కలిసి పనిచేసిన క్ష‌ణాలు అద్బుత‌మైన‌వ‌నీ, ఇప్పుడు బంధం తెంచుకుంటున్నామ‌ని పేర్కొంది. అయితే ఏడేళ్లలో జ‌ట్టు టైటిల్‌ను గెలవకపోవడంతో పాంటింగ్ పని పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగా లేదు.

అనంత్‌ అంబానీ పెళ్లి చేసిన పూజారి ఈయనే.. దక్షిణ ఎంతిచ్చారో తెలుసా?

2019లో ప్రధాన కోచ్ గా పాంటింగ్.. 

రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రధాన కోచ్ అయ్యాడు. అతని పర్యవేక్షణలో జట్టు 2021లో మొదటిసారిగా ఫైనల్స్‌కు చేరుకోవడంలో విజయం సాధించింది కానీ, ఆ త‌ర్వాత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న క్షీణించింది. ఏడేళ్ల‌లో ఒక్క‌సారి కూడా టైటిల్ ను గెలుచుకోలేక‌పోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ జ‌ట్టులో మార్పులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇదివ‌ర‌కే రికీ పాంటింగ్ కు సంబంధిత స‌మాచారం అందించిన‌ట్టు ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

సౌరవ్ గంగూలీ కొత్త కోచ్ కానున్నాడా?

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త ప్రధాన కోచ్‌ని నియమిస్తుందా లేదా జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీని ప్రధాన కోచ్‌గా వ్యవహరించాల్సిందిగా కోరుతుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. జట్టు సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ఆ పదవిలో కొనసాగడం దాదాపు ఖాయం. ఈ విషయంలో భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు ఢిల్లీ సహ-యజమానులు జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్‌ల సమావేశం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో జరగనుంది. 

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం.. 

ఐపీఎల్ 2024 తదుపరి సీజన్‌కు ముందు ఆటగాళ్ల కోసం పెద్ద బిడ్డింగ్‌కు ముందు జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లను కొనసాగించడం గురించి కూడా చ‌ర్చించానున్నారు. కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటే, ఆ జట్టు ఆస్ట్రేలియాకు చెందిన జేక్-ఫ్రేజర్ మెక్‌గర్క్ లేదా దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్‌లలో ఒకరిని మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లను కొనసాగించాలని జట్టు భావిస్తోంద‌ని స‌మాచారం.

పాకిస్థాన్‌ చిత్తు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఛాంపియన్ గా భారత్

click me!