Gus Atkinson : లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ కు ఇంగ్లాండ్ టీమ్ విక్టరీతో వీడ్కోలు పలికింది. బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు.
Gus Atkinson Super Bowling : వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన బ్రిటీష్ జట్టు ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్ జట్టును ఓడించింది. తన టెస్టు కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడిన జేమ్స్ అండర్సన్ కు గెలుపుతో వీడ్కోలు పలికింది. అయితే, ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గుస్ అట్కిన్సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో మొత్తంగా 12 వికెట్టు తీసుకుని మరో రికార్డు సాధించాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతోంది. ఈ క్రమంలోనే ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ తో 121 పరుగులకు ఆలౌట్ అయిది. రెండో ఇన్నింగ్స్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వెస్టిండీస్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. అట్కిన్సన్ అద్భుతమైన బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ సూపర్ బౌలింగ్ తో 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా చెలరేగడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 136 పరుగులకే ఆలౌట్ అయింది.
గుస్ అట్కిన్సన్ సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన బౌలింగ్ తో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్రంలో నమోదైన నాల్గవ అత్యుతమ బౌలింగ్ గణాంకాలు. ఇంగ్లాండ్ బౌలర్ గా రెండో అత్యుత్తమం. అట్కిన్సన్ ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడిగా ఫ్రెడ్రిక్ మార్టిన్ 134 ఏళ్ల రికార్డును సమం చేశాడు. 1890లో ఇంగ్లండ్‌కు తన తొలి టెస్టులో ఓవల్‌లో ఆస్ట్రేలియాపై మార్టిన్ 12 వికెట్లు పడగొట్టి కేవలం 102 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Record-breaking figures for an England bowler on Test debut at Lord's 👏
Take a bow, Gus Atkinson ✍️ | pic.twitter.com/uxD34f9RLO
అట్కిన్సన్ 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తన అరంగేట్రంలోనే 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, మూడో పేసర్. 1972లో ఆస్ట్రేలియా ఆటగాడు బాబ్ మాస్సీ ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తన అరంగేట్రం టెస్టులో 16 వికెట్లు పడగొట్టిన తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి పేసర్ అట్కిసన్ కావడం విశేషం. అంతకంటే ముందు, ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఫెర్రిస్ 1892లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తన మొదటి టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు తీశాడు. అట్కిన్సన్ విషయానికి వస్తే, 21వ శతాబ్దంలో టెస్టు అరంగేట్రం చేసిన బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇదే. ఇక తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అండర్సన్ 4 వికెట్లు తీసుకున్నాడు. 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ తన కెరీర్ లో 704 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు.
6 6 6 6 6 4.. మరోసారి యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్..