DC vs GT: ఐపీఎల్ 2024లో గుజ‌రాత్ టైటాన్స్ చెత్త రికార్డు..

By Mahesh Rajamoni  |  First Published Apr 18, 2024, 1:22 AM IST

DC vs GT : ఢిల్లీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాస్ ఆట‌తో ఆద‌ర‌గొట్టి గుజ‌రాత్ ను చిత్తుగా ఓడించింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని అందుకుని పాయింట్ల ప‌ట్టిక‌లో 6వ స్థానంలోకి చేరింది. గుజరాత్ మాత్రం చెత్త రికార్డును నమోదుచేసింది. 
 


Tata IPL 2024, GT vs DC : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో 10 జట్లు పాల్గొంటాయి. ఈ మెగా క్రికెట్ లీగ్ తో 31 మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ధ‌నాధ‌న్ బ్యాటింగ్, థ్రిల్లింగ్ విక్ట‌రీ గేమ్ లు క్రికెల్ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో అల‌రించాయి. ఈ క్ర‌మంలోనే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న 32వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇప్ప‌టివ‌ర‌కు బ్యాటింగ్ మెరుపులు  చూసిన ఐపీఎల్ 2024 ఈ మ్యాచ్ లో బౌలింగ్ మాయ‌జాలం క‌నిపించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లుగా సాహా, శుభ్ మ‌న్ గిల్ గుజ‌రాత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. 8 పరుగుల వద్ద గిల్ క్యాచ్ ఔటయ్యాడు. సాహా 2 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 12 పరుగులకు, డేవిడ్ మిల్లర్ 2 పరుగులకు, అభినవ్ మనోహర్ 8 పరుగులకు, షారుక్ ఖాన్ పరుగులేమీ చేయకుండా (0) నిరాశపరిచారు. దీంతో గుజరాత్ 8.4 ఓవర్లలో 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

Latest Videos

ఐపీఎల్ లో ఇదే లాంగెస్ట్ సిక్స‌ర్.. సూప‌ర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపిన దినేష్ కార్తీక్..

ఆ త‌ర్వాత‌ రాహుల్ ద్వివేదియా 10 పరుగులతో, మోహిత్ శర్మ 2 పరుగులకే వికెట్లు కోల్పోయారు. కాస్త నిలకడగా ఆడిన రషీద్ ఖాన్ 23 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరకు గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ప్రస్తుత ఐపీఎల్ సీజ‌న్ లో ఒక జట్టు చేసిన అతి తక్కువ పరుగులు ఇవే కావ‌డంతో చెత్త రికార్డును గుజ‌రాత్ టైటాన్స్  న‌మోదుచేసింది. ఢిల్లీ జట్టులో చక్కటి బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, స్టబ్స్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. 90 పరుగులు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్  కేవలం 53 బంతుల్లోనే టార్గెట్ ను చేధించింది. ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయం సాధించింది. రిషబ్ పంత్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, సుమిత్ కుమార్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

 

Wrapped 🆙 by Mukesh Kumar 🙌

He ends his spell with 3️⃣ wickets 👏👏

Watch the match LIVE on and 💻📱 | pic.twitter.com/sT9tWxddLa

— IndianPremierLeague (@IPL)

 

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. సునీల్ న‌రైన్ స‌రికొత్త చరిత్ర‌ 

click me!