Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో గుజరాత్ ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ. రిషబ్ పంత్ రెండు క్యాచ్ లు, రెండ్ స్టంప్స్ తో పాటు బ్యాట్ తోనూ రాణించాడు.
Tata IPL 2024, GT vs DC : ఢిల్లీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాస్ ఆటతో అదరగొట్టింది. జట్టుగా అద్భుత ప్రదర్శనతో గుజరాత్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తన అద్బుతమైన వికెట్ కీపింగ్ తో అదరగొట్టాడు. వరుసగా ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మెగా క్రికెట్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 32వ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లు శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా లు గుజరాత్ టైటాన్స్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు.
ఇందులో గిల్ 2 బౌండరీలు బాదిన తర్వాత ఇషాంత్ శర్మ ఓవర్ లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాహా 10 బంతుల్లో 2 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ 12 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 2, అభినవ్ మనోహర్ 8, షారూఖ్ ఖాన్ 0 పరుగులతో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ కు చేరారు. గుజరాత్ టైటాన్స్ 8.4 ఓవర్లలో 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తెవాటియా 10 పరుగుల వద్ద, మోహిత్ శర్మ 2 పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రశాంతంగా ఆడిన రషీద్ ఖాన్ మాత్రమే 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహా 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నూర్ అహ్మద్ 1 పరుగుకే ఔట్ అయ్యాడు.
undefined
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర
10 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ తర్వాతి 7.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేసింది. చివరకు 17.3 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్ లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. అలాగే, ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. దీనికి ముందు గతేడాది ఢిల్లీపై 125/6 పరుగులు చేశారు. ఈ ఏడాది లక్నోపై 130 పరుగులు చేసింది. అదే విధంగా గతేడాది లక్నోపై 135/6 పరుగులు మాత్రమే చేసింది.
బౌలింగ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఏడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది నాలుగో ఓటమి కాగా, 3వ విజయం. గుజరాత్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లోనూ ఢిల్లీ విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్‌పై 6 వికెట్ల తేడాతో విజయంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. రిషబ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
🔝 effort in front and behind the stumps 👌
Captain Rishabh Pant wins the Player of the Match Award for his leading from the front act 🙌 🏆
Scorecard ▶️ https://t.co/SxAzZl3Jf6 | pic.twitter.com/uYT5shQGYR
KKR vs RR Highlights : ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేసిన జోస్ బట్లర్..