ఢిల్లీ నుండి ముంబై వరకు సంబరాల హోరు.. టీమిండియాకు ప్ర‌ధాని గ్రాండ్ వెల్‌కమ్ !

By Mahesh RajamoniFirst Published Jul 3, 2024, 4:50 PM IST
Highlights

Team India : టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత బార్బడోస్‌లో టీమిండియా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని ప్రపంచ ఛాంపియన్ జట్టు భార‌త్ తిరిగి స్వదేశానికి వ‌స్తున్న నేప‌థ్యంలో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు యావ‌త్ భార‌తావ‌ని సిద్ధంగా ఉంది. 

Team India : అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదిక‌లుగా నిర్వ‌హించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భార‌త జ‌ట్టు ఛాంపియన్ గా నిలిచింది. బార్బడోస్‌లో లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను 7 ప‌రుగుల తేడాతో ఓడించి భార‌త్ రెండో సారి టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ ను సాధించింది. అయితే ప్రపంచ ఛాంపియన్ జ‌ట్టు తిరిగి స్వాదేశానికి ఎప్పుడు వ‌స్తుందా అని క్రికెట్ ల‌వ‌ర్స్ తో పాటు యావ‌త్ భార‌తావని ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ స‌మ‌యంలో రానే వ‌చ్చింది. బెరిల్ తుపాను కారణంగా భారత జట్టు బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. ఇప్పుడు తుఫాను ప్ర‌భావం త‌గ్గ‌డంతో రోహిత్ సేన గురువారం భార‌త్ లో ఐసీసీ ట్రోఫీతో అడుగుపెట్ట‌నుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టీమిండియాకు గ్రాండ్ గా స్వాగ‌తం ప‌ల‌కనున్నారు.

ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ల‌కు ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా సన్మానం

Latest Videos

గురువారం ఉద‌యం భార‌త జ‌ట్టు స్వ‌దేశానికి తిరిగి రానుంది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆట‌గాళ్ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌న్మానించ‌నున్నారు. జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టు దాదాపు మూడు రోజుల పాటు బార్బడోస్‌లో తుఫాను కార‌ణంగా చిక్కుకుంది. అయితే ఇప్పుడు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.50 గంటలకు భారత ఆటగాళ్లు తమ కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది, బీసీసీఐ అధికారులతో కలిసి బార్బడోస్ నుంచి బయల్దేరారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక‌ చార్టర్ ప్లేన్‌ను భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు, సిబ్బంది, వారి కుటుంబ స‌భ్యులు స్వ‌దేశానికి తిరిగి వస్తున్నారు.

ఢిల్లీ నుంచి ముంబై వ‌ర‌కు సంబురాలు.. 

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా టీమ్ ఇండియాకు స్వాగతం పలకడానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను తెలిపారు. 'బీసీసీఐ తీసుకొచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో బార్బడోస్ నుంచి జట్టు బయల్దేరింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ జర్నలిస్టులు కూడా అదే విమానంలో వస్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకు విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగనుంది. ఈ బృందం ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో ప్రధాని మోడీని కలవనుంది. దీని తర్వాత జట్టు ముంబైకి వెళ్లనుంది. నారిమన్ పాయింట్ నుంచి రోడ్ షో నిర్వహించి అనంతరం క్రీడాకారులను సన్మానించనున్నారు" అని శుక్లా తెలిపారు.

అప్పుడు ధోని.. ఇప్పుడు రోహిత్ శ‌ర్మ 

2007 లో టీం ఇండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని ఉన్నాడు. ఆ త‌ర్వాత 2022లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ ఓట‌ముల‌కు ప్ర‌తీకారం తీర్చుకున్న రోహిత్ సేన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐసీసీ టైటిల్ ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది.

click me!