నెంబ‌ర్.1 ఆల్ రౌండర్‌గా టీమిండియా స్టార్ ప్లేయ‌ర్

By Mahesh Rajamoni  |  First Published Jul 3, 2024, 4:06 PM IST

ICC No.1 All Rounder : జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా  మ్యాచ్ ను మ‌లుపుతిప్పి భార‌త్ వైపు తీసుకువ‌చ్చాడు. 17వ ఓవర్ మొదటి బంతికి హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేయ‌డంతో పాటు 3 వికెట్లు తీసుకుని టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.
 


ICC No.1 All Rounder Hardik Pandya : ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెంబ‌ర్.1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా. మ్యాచ్ ను పూర్తిగా మలుపు తిప్పిన‌ హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తో పాటు మొత్తంగా ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్‌లో కేవలం 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 11 వికెట్లు తీశాడు. 

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన హార్దిక్ పాండ్యా ఐసీసీ టీ20 ర్యాకింగ్స్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం 222 రేటింగ్ పాయింట్‌లతో టీ20 క్రికెట్ నెంబ‌ర్.1 ఆల్ రౌండ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ మూడో స్థానంలో ఉండగా, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Latest Videos

undefined

హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచ కప్ 2024లో భార‌త్ కు అత్యంత కీల‌క‌మైన ప్లేయ‌ర్ గా కొన‌సాగాడు. పాండ్యా ఆరు ఇన్నింగ్స్‌లలో 48 సగటు, 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అలాగే, బౌలింగ్ లోనూ అద‌ర‌గొట్టాడు. మొత్తంగా 11 వికెట్లు తీశాడు. ఈ మెగా టోర్నీలో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన వారిలో వ‌రుస‌గా అర్ష్‌దీప్ సింగ్ (17 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (15 వికెట్లు)ల త‌ర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు.

ఐపీసీ టీ20 ఆల్ రౌండ‌ర్స్ ర్యాంకింగ్స్

1. హార్దిక్ పాండ్యా
2. వానిందు హసరంగా
3. మార్కస్ స్టోయినిస్
4. సికందర్ రజా
5. షకీబ్ అల్ హసన్

 

click me!