హైద‌రాబాద్‌లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. అఖిల్ తో సోనూసూద్ ఢీ.. ! వారికి ఫ్రీ ఎంట్రీ !

By Mahesh Rajamoni  |  First Published Feb 28, 2024, 5:02 PM IST

Celebrity Cricket League: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు హెచ్ సీఏ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు కూడా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు.
 


Celebrity Cricket League (CCL 2024) : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావు  తెలిపారు. ఈ లీగ్ మొదటి దశ మ్యాచ్ లు షార్జాలో జరుగుతుండగా, రెండో దశ మ్యాచ్ లు మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్ వేదిక‌గా జరుగుతాయని ఆయన తెలిపారు. దీంతో ఈ లీగ్ లో ఆడేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ ప్రముఖులు, తారలు హైదరాబాద్ రానున్నారు.

రోజూ 10,000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం

Latest Videos

సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ చూడ‌టానికి రోజు 10,000 మంది విద్యార్థుల‌కు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. హైదరాబాద్, తెలంగాణ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఈ మ్యాచ్‌లను చూపించాలని సీసీఎల్‌ నిర్వాహకులను కోరగా, వారు దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని జగన్‌మోన్మోహ‌న్ రావు తెలిపారు. 10,000 మంది కాలేజీ విద్యార్థుల‌కు (ఇంటర్మీడియట్, యూజీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు) ఉచితంగా స్టేడియంలోకి అనుమతించనున్నారు.

ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు

సీసీఎల్ మ్యాచ్ ల‌ను చూడ‌టానికి తమ విద్యార్థులను పంపే ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యాసంస్థల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను విద్యార్థుల పేర్లతో పాటు HCA hca.ccl2024@gmail.comకు ఇమెయిల్ చేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత తమ సిబ్బంది వారికి పూర్తి వివరాలు అందిస్తారని తెలిపారు. మ్యాచ్‌లకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఐడీ కార్డులతో రావాలని తెలిపారు.

హైదరాబాద్ లో 6 సీసీఎల్ మ్యాచ్ లు.. 

ఒక్కోరోజు రెండు మ్యాచ్‌ల చొప్పున మూడు రోజుల్లో హైదరాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు జగన్ మోహన్ రావు తెలిపారు. టాలీవుడ్ టీమ్ తెలుగు వారియర్స్ కు హీరో అక్కినేని అఖిల్ కెప్టెన్ గా ఉన్నారు. ముంబై హీరోస్, కేరళ స్ట్రైకర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ డి షేర్ జట్లు తలపడనున్నాయి. ఒక్కో జట్టుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు ఆడతారని వివరించారు. మార్చి 1న టాలీవుడ్ టీమ్ హైద‌రాబాద్ లో తొలిమ్యాచ్ ఆడ‌నుంది.

IPL 2024: చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అవుతుందా?

 

Get ready to witness the magic unfold as your favorite stars bring their charisma and skill to the field in an unforgettable clash of entertainment and sportsmanship! 🌟🏏

Book your tickets 🔗 https://t.co/pNf9UzAQMY Presents CCL Hyderabad Weekend. starts… pic.twitter.com/xU0FRdjuzE

— CCL (@ccl)
click me!