IND vs ENG: టీమిండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రాకు భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ కు ముందు విశ్రాంతి ఇవ్వగా, కేఎల్ రాహుల్ మొదటి టెస్ట్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య ధర్మశాలలో 5వ టెస్టు జరగనుంది.
India vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ను ఇప్పటికే భారత్ దక్కించుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ధృవ్ జురెల్, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.
5వ టెస్టు ఆడనున్న బుమ్రా..
undefined
ఐసీసీ టెస్ట్ బౌలర్‌గా ప్రపంచ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ లో ఆడనున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. మొదటి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 17 వికెట్లు తీసుకున్నాడు. అయితే, డిమాండ్‌తో కూడిన షెడ్యూల్‌లో అతని పనిభారాన్ని గుర్తించిన బీసీసీఐ రాంచీలో జరిగిన 4వ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. ఇది రాబోయే సవాళ్ల కోసం అతని ఫామ్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ప్రస్తుత నివేదికల ప్రకారం.. ధర్మశాలలో జరగబోయే ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే.. !
కేఎల్ రాహుల్ డౌటే.. !
కేఎల్ రాహల్ గాయం కారణంగా ప్రస్తుత తొలి మ్యాచ్ తర్వాత ఈ సిరీస్ లోని మిగతా మ్యాచ్ లకు దూరం అయ్యాడు. అయితే, ధర్మశాలలో జరిగే 5వ టెస్టు మ్యాచ్ లో కూడా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. బీసీసీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లు కేఎల్ రాహుల్ ఆరోగ్య పరిస్థితి, ఫిట్‌నెస్ పై దృష్టిపెట్టాయి. ఫిబ్రవరి మధ్యలో రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 90 శాతం ఫిట్‌గా ఉన్నట్లు భావించినప్పటికీ, రాహుల్ పూర్తిగా కోలుకోకపోవడంతో ఆటకు దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం.. గాయం దృష్ట్యా కేఎల్ రాహుల్ ను చికిత్స కోసం విదేశాలకు పంపనున్నారు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై బీసీసీఐ నుంచి కానీ, టీమ్ నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు.
ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు