హనుమ విహారికి షాకిచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 28, 2024, 10:25 AM IST

Hanuma Vihari - ACA: ఇక‌పై తాను ఆంధ్ర టీమ్ కు ఆడ‌బోన‌నీ, ఒక రాజ‌కీయ నాయ‌కుడి ఒత్తిడితో త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని హనుమ విహారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే, జ‌ట్టులోని ఇత‌ర క్రికెట‌ర్ల‌పై తీవ్ర ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డంతో పాటు సహచరులను బెదిరించారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.


Hanuma Vihari - Andhra Cricket Association : ఆంధ్ర క్రికెట్ వివాదం ముదురుతూనే ఉంది. ఇప్పుడు రాజ‌కీయాల‌కు వేదిక‌గా అధికార‌-ప్ర‌తిప‌క్షాల‌కు మాట‌ల యుద్ధానికి తెర‌లేపింది. అయితే, హ‌నుమ విహారి చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ) పేర్కొంటూ షాకిచ్చింది. హనుమ విహారి త‌న‌ను ఒక రాజ‌కీయ నేత ఒత్తిడితో కెప్టెన్సీ నుంచి తొల‌గించార‌నీ, ఇలా త‌న‌ను అవమాన‌పర్చ‌డం త‌గ‌ద‌నీ, ఇక‌పై ఆంధ్ర టీమ్ త‌ర‌ఫున ఆడ‌బోన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో 'లెటర్ ఆఫ్ సపోర్ట్' ను పంచుకున్నాడు. దీనిపై ఏసీఏ స్పందిస్తూ.. ఆంధ్రా క్రికెట్  క్రికెటర్లు బలవంతంగా సంతకం చేసేలా ప్రేరేపించార‌ని పేర్కొంది. దీనికి సంబంధించి ఆటగాళ్ల నుండి లేఖలను పంచుకుంది.

విహారి ఏం చెప్పారు? 

Latest Videos

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో ఆంధ్ర టీమ్ ఓట‌మిపాలైంది. మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ 2024లో సెమీ-ఫైనల్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ తీరుపై విహారి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న‌ప‌ట్ల  దుర్మార్గంగా ప్రవర్తించార‌నీ, రాజకీయ జోక్యంతో త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని పేర్కొన్నాడు. తమ జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తన కుమారుడిని విహారి తీవ్ర ప‌ద‌జాలంతో దుర్భాషలాడాడని క్రికెటర్ పృధ్వీ రాజ్ కెఎన్ తండ్రి, రాజకీయ నాయకుడు రాష్ట్ర అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్రా బోర్డు తనను రాజీనామా చేయమని కోరిందని విహారి చెప్పారు. తాను ఆంధ్రా తరఫున ఎప్పటికీ ఆడనని, బోర్డు వ్యవహరించిన తీరు తనను అవమానించిందని పేర్కొన్నాడు. 

ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు

ఆంధ్ర‌ క్రికెట్ అసోసియేష‌న్ షాక్.. ! 

అయితే, విహారీని కెప్టెన్‌గా కొన‌సాగించాల‌ని కోరుతూ ఆటగాళ్ల సంతకాలు చేసిన లెట‌ర్ ను కూడా విహారి పంచుకున్నాడు. దీంతో ర‌చ్చ మ‌రింత ముదిరింది. దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఈ లేఖ‌పై క్రికెట‌ర్ల సంత‌కాల‌ను ఒత్తిడి చేసి పొందారని ఏసీఏ తెలిపింది. గతంలో విహారి ప్రవర్తనకు సంబంధించిన సమస్యల గురించి పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఏసీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర సంఘం తెలిపింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేర్కొన్న‌వివిధ క్లెయిమ్‌లు, వాటిని సమర్ధించే లేఖల కాపీలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జట్టులోకి వచ్చి వెళ్లే ఆటగాళ్ల వల్ల స్థానిక క్రీడాకారులు అవకాశాలు కోల్పోతున్నారని క్రీడాకారుల తల్లిదండ్రులు పలుమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ విహారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని కొన‌సాగించింది. అయితే సోషల్ మీడియా వేదికలపై విహారి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరంగా ఏసీఏ పేర్కొంది.

లేఖ‌పై ఫిర్యాదు.. 

తనను కెప్టెన్‌గా కొనసాగించేందుకు జట్టులోని ఆటగాళ్లంతా మద్దతిస్తున్నప్పటికీ తనను తొలగించారని హనుమ విహారి ఆరోపించాడు. కానీ, ఈ విషయమై సంబంధిత ఆటగాళ్లు విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెదిరింపులతో తమతో బలవంతంగా సంతకాలు చేయించారని కొందరు ఆటగాళ్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అందిన ఫిర్యాదులన్నింటినీ క్షుణ్ణంగా విచారించి వాస్తవాలను బీసీసీఐకి నివేదిస్తుందని పేర్కొంది. జట్టులోని మరో ఆటగాడు పృధ్వీ రాజ్ కెఎన్ హనుమ విహారి రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తి అని ఆరోపించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమ‌నీ, ఆంధ్ర రంజీ ట్రోఫీ జట్టులో 17వ సభ్యుడు కావడంతో కేఎన్ పృథ్వీ రాజ్ ఒక్కసారి కూడా రంజీ జట్టులోకి రాలేద‌నీ, అత‌న్ని ఆడించ‌క‌పోవ‌డం కార‌ణం విహారిగా పేర్కొంది. పృథ్వీ రాజ్ చిన్నతనం నుండి అండర్ 14, అండర్ 16 ఏజ్ గ్రూప్ క్రికెట్, అండర్ -19, వినూ మన్కడ్, కూచ్ బీహార్ ట్రోఫీ, అండర్ 23, 25 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆడి మంచి ప్రతిభ కనబరిచాడ‌ని పేర్కొంది. 2023లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడని తెలిపింది.

Ranji Trophy: క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి.. ముంబై ప్లేయర్ల‌ అద్భుత ఫీట్ !

click me!