Gautam Gambhir shocked Hardik Pandya : భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీ20కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావడం పక్కా అనే రిపోర్టుల మధ్య మరో ట్విస్ట్ వచ్చింది.
Gautam Gambhir shocked Hardik Pandya : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా జట్జును ముందుకు నడిపించాడు. ఇద్దరు జట్టును ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టారు. అయితే, టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో వెంటనే కొత్త కెప్టెన్ ను ప్రకటించకుండానే తాత్కాలిక కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో భారత జట్టు జింబాబ్వే టూర్ ను విజయవంతంగా ముగించుకుని వచ్చింది. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ పేరును ప్రకటించడానికి సిద్ధంగా ఉంది.
మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యాను టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ హాట్ టాపిక్ గా మారింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. కొత్త కెప్టెన్ ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీలోని మెంబర్స్ తో పాటు బీసీసీఐ లోని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో లేరు. కొత్త టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి అతిపెద్ద కారణం హార్దిక్ ఫిట్‌నెస్.. అతని గాయాలు. దీని కారణంగా చాలా కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో భారత్ జట్టును టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. కానీ, పదేపదే గాయాలు, జట్టుకు దూరంగా ఉండటం కెప్టెన్సీ విషయంలో అతనికి వ్యతిరేకంగా మారింది.
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా కంటే గొప్ప క్రికెటర్.. !
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం.. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. 'ఇది చాలా సున్నితమైన విషయం, రెండు విషయాలపై కొంత చర్చ జరుగుతోంది, అందువల్ల హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయడంపై అందరూ ఏకాభిప్రాయంతో లేరు' అని పేర్కొన్నారు. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్య కారణంగా ఉంది కానీ, అతను ఐసీసీ ట్రోపీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కాకుండా, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని కెప్టెన్సీని సరిగ్గా తీసుకున్నారని సూర్యకుమార్ యాదవ్‌కు సంబంధించి మాకు కొంత ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చిందని పేర్కొన్నారు. పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓటు కూడా హార్దిక్ పాండ్యా విషయంలో కీలకం. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోమని గంభీర్‌ని అడగవచ్చని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో గంభీర్ హార్దిక్ కు కాకుండా సూర్యకుమార్ యాదవ్ కు అనుకూలంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీలో గౌతమ్ గంభీర్-సూర్యకుమార్ యాదవ్ కలిసి ఆడిన సంగతి తెలిసిందే. అలాగే, సూర్య కూడా టీమిండియాకు పలు సిరీస్ లలో కెప్టెన్ గా కొనసాగాడు.
టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరు?