India vs England: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు విశాఖ తీరంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ వికెట్లు ఎగిరి పడుతున్నాయి. అద్భుతమైన యార్కర్ తో ఒల్లీ పోప్ ఔట్ కాగా, రెండు వికెట్లు ఎగిరిపడటం ఈ ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచింది.
India vs England: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు విశాఖ తీరంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ వికెట్లు ఎగిరి పడుతున్నాయి. అద్భుతమైన యార్కర్ తో ఒల్లీ పోప్ ఔట్ కాగా, రెండు వికెట్లు ఎగిరిపడటం ఈ ఇన్నింగ్స్ లో మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. గ్రౌండ్ లో బూమ్ బూమ్ బుమ్రా అంటూ హోరెత్తింది. టెస్టులో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్.. 177/6 (40.1) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
భారత పేసర్లు ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు. జస్ప్రిత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా సూపర్బ్ యార్కర్ తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయంలో కీలకంగా ఉన్న ఓలీ పోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ లో ఓలీ పోప్ బౌల్డ్ అయిన తీరుకు క్రికెట్ లవర్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. యార్కర్ల కింగ్ బుమ్రా అనీ, బూమ్ బూమ్ బుమ్రా.. బుమ్రానా మాజాకా.. బుమ్రా బౌలింగ్ అంటే ఇదే మరి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన క్లీన్ బౌల్డ్ అంటూ సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
పోరాడుతా.. ఎప్పటికీ లొంగిపోను: డబుల్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ వీడియో వైరల్
Timber Striker Alert 🚨
A Jasprit Bumrah special 🎯 🔥
Drop an emoji in the comments below 🔽 to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV | | | pic.twitter.com/U9mpYkYp6v
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 396 (యశస్వి జైస్వాల్ 209; జేమ్స్ అండర్సన్ 3-47, రెహాన్ అహ్మద్ 3-65)
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 177/6 (40.1)* (జాక్ క్రాలే 76; బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు)
ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో యశస్వి జైస్వాల్ సాధించిన టాప్-5 రికార్డులు