Under 19 Aisa Cup 2023: యూఏఈలో జరగనున్న అండర్-19 ఆసియా కప్ 2023కి భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జాబితాను ప్రకటించింది. అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ జట్టులో ఇద్దరూ హైదరాబాదీలకు చోటు దక్కింది.
Under 19 Aisa Cup 2023: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2023కి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఉదయ్ సహారన్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. 19 ఏళ్ల క్రికెటర్ సహారన్ కొంతకాలంగా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 19 ఏళ్ల ఉదయ్ సహారన్ రాజస్థాన్ నివాసి, అతడు గత ఏడాది ఆంటిగ్వాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులో చేర్చబడ్డాడు.
15 మంది సభ్యులతో కూడిన జట్టుకు సౌమ్య కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టు ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా ఉంది మరియు ఈ పోటీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్‌తో కూడిన గ్రూప్‌లో భారత్‌కు చోటు దక్కింది.
డిసెంబరు 8న ఐసీసీ అకాడమీ ఓవల్ 1లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మధ్య డిసెంబర్ 10న అదే వేదికపై మ్యాచ్ జరగనుంది. భారత జట్టు డిసెంబర్ 12న నేపాల్‌తో గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 17న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు
భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (WK), M అభిషేక్, ఇనేష్ మహాజన్ (WK), ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
ట్రావెలింగ్ రిజర్వ్: ప్రేమ్ డియోకర్, అన్ష్ గోసాయి, మొహమ్మద్ అమన్.
అండర్-19 ఆసియా కప్ 2023 షెడ్యూల్
డిసెంబర్ 8: భారతదేశం vs ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ vs నేపాల్
డిసెంబర్ 9: బంగ్లాదేశ్ vs యూఏఈ, శ్రీలంక vs జపాన్
డిసెంబర్ 10: భారత్ vs పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ vs నేపాల్
డిసెంబర్ 11: శ్రీలంక vs యూఏఈ, బంగ్లాదేశ్ vs జపాన్
డిసెంబర్ 12: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం vs నేపాల్
డిసెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక, యూఏఈ vs జపాన్
డిసెంబర్ 15 : దుబాయ్ స్టేడియంలో తొలి సెమీఫైనల్
ICC అకాడమీ ఓవల్ 1లో రెండవ సెమీ-ఫైనల్
డిసెంబర్ 17: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్