IND vs AUS 2nd T20: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదిక కానున్నది. అయితే.. ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఉంటుందా..? మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది?
IND vs AUS 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో మ్యాచ్ నేడు జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణం భయంకరంగా ఉంది. మ్యాచ్‌కు ఒకరోజు ముందు శనివారం ఇక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం మొత్తం నీటితో నిండిపోయింది. పిచ్ కప్పబడినప్పటికీ ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ఆదివారం ఉదయం కూడా తిరువనంతపురంలో వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మధ్యాహ్నం వరకు 55 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వరకు వాతావరణం స్పష్టంగా ఉంటుంది. వర్షం కురవకుంటే.. అభిమానులు మొత్తం మ్యాచ్ ను చూడగలరు. కానీ, రాబోయే 24 గంటలపాటు ప్రతికూల వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి.
ప్రపంచ కప్ తర్వాత.. భారత క్రికెట్ జట్టు తన మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు మైదానంలోకి వచ్చింది. అయితే ఆ జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసి 80 పరుగులతో పటిష్ట ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో జట్టు బౌలింగ్ ఆందోళన కలిగించింది. దీంతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు. ముఖేష్ తప్ప మరే ఇతర బౌలర్ కూడా సమర్థవంతంగా రాణించలేదు. అటువంటి పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్ రెండవ T20 మ్యాచ్‌లో ఆ తప్పులను పునరావృతం చేయకుండా, వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తాడని, సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.