IND vs AUS 2nd T20: ఆ ఆటగాడిపై వేటు పడేనా? రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

By Rajesh Karampoori  |  First Published Nov 26, 2023, 3:29 AM IST

IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. విజయోత్సవంతో ఉన్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నేడు తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగంలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. తిరువనంతపురం పిచ్ కు అనుగుణంగా ఎక్స్‌ట్రా పేసర్ ను బరిలోకి దిగనుంది.


IND vs AUS 2nd T20: భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. రెండో మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం మైదానంలో జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా.. రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి.. తన ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు.. తొలి మ్యాచ్ లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంగరూ టీమ్ భావిస్తోంది. 

వాస్తవానికి తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ విభాగం పేలవంగా ఉన్నా.. బ్యాటింగ్ లో రాణించడంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. ఈ తరుణంలో టీమిండియా కీలక మార్పులు చేయాలని భావిస్తోంది.  తిరువనంతపురం పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనున్నది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేస్ ఆప్షన్‌తో బరిలో దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

ఈ తరుణంలో రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే టీమ్ ఇండియా ఆడే 11లో అవకాశం ఉంది. ఎందుకంటే.. గత మ్యాచ్‌లో టీమిండియా కేవలం 5 మంది బౌలర్లతోనే ఆడింది. అయితే ఇప్పుడు శివమ్ దూబేను జట్టులో చేర్చుకోవడం ద్వారా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆరో బౌలర్ ఎంపిక లభించనుంది. శివమ్ దూబే ఏంట్రీతో బ్యాటింగ్ విభాగం కూడా మరింత పటిష్టంగా మారునున్నది. ప్రస్తుతం శివమ్ దూబే కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.  

వాస్తవానికి సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.దాంతోనే అతన్ని పక్కనపెట్టి శివమ్ దూబేను జట్టులోకి తీసుకునే అవకాశముంది.  లేదు.. అక్షర్ పటేల్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే.. తిలక్ వర్మ లేదా యశస్వీ జైస్వాల్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముంది.  

ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. దీంతో తిలక్ వర్మ రెండో టీ20 మ్యాచ్ నుంచి తప్పుకోవచ్చు. తిలక్ వర్మ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేకి అవకాశం ఇవ్వవచ్చు. ఇది మినహా టీమ్ ఇండియా జట్టులో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఎందుకంటే.. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన బాగుంది.

ఆసీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

click me!