Kapil Dev: కపిల్ దేవ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఆయన అభిమానులు కూడా భారీగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? అందులో కపిల్ ఏం చేశారు? తెలుసుకోవాలంటే..ఇంకేం ఆలస్యం కాకుండా మీరు కూడా ఓ లూక్కేయండి మరీ..
Kapil Dev: భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు, ప్రసిద్ధ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ జనవరి 6, 2024న తన 65వ పుట్టినరోజును జరుపుకున్నారు. కపిల్ నాయకత్వంలో టీమిండియా ఎన్నో విజయాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా 1983లో జరిగిన ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా తొలిసారి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో టీమిండియా దశ దిశ రెండు మారాయి.
అందుకే ఇంతకీ అపూర్వ విజయాన్ని అందించిన లెజండరీ ఆటగాడు కపిల్ దేవ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టిన రోజున అభిమానులు, పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఈ లెజండరీ క్రికెటర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా.. తాజాగా కపిల్ దేవ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో తన భార్య రోమితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ద ట్రెయిన్ సినిమాలోని గులాభీ ఆంఖీన్ అనే పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ వీడియోకు విపరీతమైన లైక్‌లు వస్తున్నాయి. బ్యాటింగ్ తోనే కాదు.. తన బౌలింగ్ తో కూడా ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించే కపిల్ దేవ్ .. తన భార్య తో కలిసి స్టెప్పులేయడం అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కపిల్ దేవ్ కు క్రికెట్ ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం ఉంది. భారత క్రికెట్ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో కపిల్ దేవ్ ఒకరు. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది. టీమ్ ఇండియా తరుపున కపిల్ 131 టెస్టుల్లో, 225 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 431 వికెట్లు తీయడంతో పాటు 5,248 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టడంతో పాటు 3,783 పరుగులు సాధించారు.
This video will warm your hearts! Kapil paaji and Romi bhabhi are not just a million-dollar couple, they are also the cutest! pic.twitter.com/3u8EfUcUb1
— Vikrant Gupta (@vikrantgupta73)