Aakash Chopra: "కేఎల్ రాహుల్ తప్పు ఏమిటి ?" 

By Rajesh KarampooriFirst Published Jan 10, 2024, 12:43 AM IST
Highlights

Aakash Chopra comments: ఆఫ్ఘనిస్తాన్‌తోజరిగే టీ 20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ను తప్పించడంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. 
 

Aakash Chopra comments: ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ఆదివారం ప్ర‌క‌టించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. వీరితో పాటు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కూడా జట్టులో అవకాశం లభించింది. కానీ అప్పటి నుంచి సెల‌క్ట‌ర్ల పై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.

సార్ట్ బ్యాట్స్ మెన్స్ కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఇషాన్ కిష‌న్ వంటి ఆట‌గాళ్లుకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ కు జట్టులో చోటు దక్కకపోవడంపై  వ్యాఖ్యాత, టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Latest Videos

జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి తీసుకున్నప్పటికీ KL రాహుల్‌ను జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదని  ప్రశ్నించారు. కేఎల్ రాహుల్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని, సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నప్పటికీ కేఎల్ రాహుల్‌ను ఎందుకు పిలవరు? సెలక్టర్ లను నిలదీశాడు.ఇంతకీ కేఎల్ రాహుల్ ఏమి తప్పు చేసాడని ప్రశ్నించారు.

గత టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేస్తుంటే.. ఆ టోర్నీలో రోహిత్, కేఎల్ రాహుల్ ఇద్దరూ బాగా ఆడలేకపోయారని, కానీ, వన్డే సిరీస్ లో కేఎల్ రాహుల్ బాగా రాణించాడని ఎత్తి చూపాడు. వికెట్ కీపింగ్‌తో పాటు KL రాహుల్ లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడని తెలిపారు. సీనియర్‌లను జట్టులోకి తిరిగి తీసుకున్నప్పుడూ.. కేఎల్ రాహుల్ చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.   
 
వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత భారత జట్టు స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ వ్యవహరించారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో కూడా అయ్య‌ర్ కు చోటు దక్కింది. కానీ.. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో అత‌డికి ఎందుకు చోటు ద‌క్క‌లేద‌ని చోప్రా ప్ర‌శ్నించాడు. 

ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబెకు  జ‌ట్టులో స్థానం కల్పించినా.. కానీ, ద‌క్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు సెలక్టర్లు అతడ్ని ప‌క్క‌న బెట్టారు. మ‌ళ్లీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు అతడ్ని జట్టులో స్థానం కల్పించడమేంటో? తనకేం అర్థం కావ‌డం లేద‌న్నాడు. అలాగే.. ఇషాన్ కిష‌న్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై మండిప‌డ్డాడు. ఇషాన్ కిష‌న్ గురించిన ఏమైన స‌మాచారం ఉందా లేదా..? అని చోప్రా సెల‌క్ట‌ర్ల తీరుపై మండిప‌డ్డాడు.

వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఇషాన్ కిషన్ కంటే ముందుగా జట్టులోకి ఎందుకు చేర్చారని చోప్రా ప్రశ్నించాడు. ముఖ్యంగా ఇషాన్ దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ జట్టు ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాల వల్ల అతడు జట్టుకు దూరమయ్యారు. అదే సమయంలో  యశస్వి జైస్వాల్ లేదా గిల్‌లలో ఒకరు మాత్రమే రోహిత్‌తో ఓపెనింగ్ చేస్తారని, ర్యాంక్ T20I నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను మూడో స్థానంలో ఆడగలరని చోప్రా చెప్పాడు. 

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్ మొహాలి లో జరుగుతుంది. రెండో మ్యాచ్ జనవరి 14న ఇండోర్‌లో జరగగా.. ఫైనల్ మ్యాచ్ జనవరి 17 న బెంగళూరులో జరుగుతుంది. 

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్‌ గిల్, య‌శ‌స్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్‌ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

 

 

click me!