IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సౌతాఫ్రికా విధ్వంసకర బౌలింగ్, నిలకడైన బ్యాంటింత్ తో అదరగొట్టింది. ఇక భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రభావం చూపలేకపోయింది.
why india lost boxing day test: సౌతాఫ్రికా గడ్డపైటీ20, వన్డే సిరీస్ లలో సత్తా చాటిన భారత్ బ్యాక్సింగ్ డే టెస్టులో చేతులెత్తేసింది. సఫారీ జట్టుతో సెంచూరియన్ లో జరిగిన బాక్సింగ్ డే టేస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్ లో స్టార్ ప్లేయర్లు ఉన్న జట్లు ఎందుకు ఓడిపోయింది. యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్లు ఉన్నా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడానికి కారణాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు దక్షిణాఫ్రికా చేతితో మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి..
రెండు ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేసిన ఓపెనర్లు..
undefined
భారత్ జట్టు ఆడిన చాలా మ్యాచ్ లలో ఒపెనర్లు రాణిస్తే విజయాలు అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, సఫారీలతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో సీనియర్, యంగ్ ప్లేయర్ తో కూడిన ఓపెనింగ్ జోడీ దారుణంగా విఫలమైంది. రెండు ఇన్నింగ్స్ లోనూ రోహిత్(5, 0), యశస్వీ జైస్వాల్(17, 5) నిరాశపరిచారు. ఒపెనర్లు త్వరగానే ఔట్ కావడం జట్టుపై మరింత ఒత్తిడిని పెంచింది. ఓపెనర్లలో ఎవరైనా మంచి ఇన్నింగ్స్ ఆడివుంటే భారత్ ఘోర ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితు వుండేది.
నిరాశపర్చిన బ్యాటర్స్..
భారత్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. పెద్దగా రాణించకపోవడం కూడా భారత్ జట్టు ఓటమికి కారణం అయింది. మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ బ్యాట్ తో రాణించారు. మిగతా ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదటి రెండో ఇన్నింగ్స్ లలో వీరిద్దరికి ఇతర బ్యాటర్ల నుంచి సపోర్టు వుంటే మ్యాచ్ ఫలితం వేరేలా వుండేది.
ఇదేందయ్యా ఇది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్.. ఆగిన మ్యాచ్ !
పసలేని బౌలింగ్..
బాక్సింగ్ డే టెస్టులో బ్యాటర్స్ తో పాటు బౌలర్లు కూడా రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగిన గ్రౌండ్ లో భారత్ బౌలర్లు తడబడ్డారు. జస్‌ప్రీత్ బుమ్రా (4 వికెట్లు), మహమ్మద్ సిరాజ్ (2 వికెట్లు) ఆశించిన విధంగా బౌలింగ్ లో రాణించలేకపోయారు. ఇక ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ ప్లేయర్ మహ్మద్ షమీ లేకపోవడం కూడా భారత జట్టుకు నష్టం కలిగించిందనే చెప్పాలి. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.
సీనియర్లు లేనిలోటు..
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో సీనియర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటర్స్ లో యంగ్ ప్లేయర్లు తీసుకుని సీనియర్లను తప్పించారు. పలువురు ప్లేయర్లు గాయాలు, ఇతర కారణాలతో జట్టుకు దూరం కావడం భారత్ కు ప్రతికూలంగా మారింది. చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, మహ్మద్ షమీ వంటి ప్లేయర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
టాస్, పిచ్..
సెంచూరియన్ పిచ్ పై బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుందని గత గణాంకాలు పేర్కొంటున్నాయి. బౌలర్లకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. రాత్రి వర్షం పడటం, టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం తీవ్ర నష్టం కలిగించింది. మరో విషయం భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం కాగా, దక్షిణాఫ్రికా బ్యాట్, బాల్ తో రాణించి విజయం సాధించింది, కగిసో రబడా, నండ్రె బర్గర్ నిప్పులు చెరిగారు. ఎల్గర్ (185), మార్కో జాన్సన్ (84*), బెడింగ్‌హామ్ (56) పరుగులతో సఫారీల విజయంలో తమదైన పాత్ర పోషించారు.
Young Couple: ఇదేంది గురూ.. గ్రౌండ్ లోనే ఇలా చేస్తే ఎలా.. !