Abhishek Sharma : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. భారత్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ తన రెండవ మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీ సాధించి అనేక రికార్డులు సృష్టించాడు.
Abhishek Sharma : ఆదివారం హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై తన సునామీ బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని సాధించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను రెండు పరుగుల వద్ద అవుట్ కావడంతో జాగ్రత్తగా అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు.
శనివారం జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో భారత్ భారత్ 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలోనే చెత్త రికార్డు లిస్టులో చేరాడు. ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్, పృథ్వీ షా తర్వాత టీ20 అరంగేట్రంలో డకౌట్ అయిన నాల్గవ భారత ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. అయితే, ఐపీఎల్ సునామీ బ్యాటింగ్ చేసిన అభిషేక్ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో హార్డ్ హిట్టింగ్ తో అదరగొట్టాడు. సిక్సర్ తో ఇన్నింగ్స్ మొదలు పెట్టి సిక్సర్ తోనే సెంచరీ కొట్టాడు.
Latest Videos
undefined
సిక్సర్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.. సిక్సర్ తోనే హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు అభిషేక్ శర్మ.
ఆఫ్ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్‌పై డీప్ మిడ్ వికెట్ మీదుగా బిగ్ సిక్సర్‌తో అభిషేక్ తన పరుగులను ప్రారంభించాడు. ఎనిమిదో ఓవర్లో 27 పరుగుల వద్ద వెల్లింగ్టన్ మసకద్జా చేతిలో పడిపోయాడు. కానీ అతను క్యాచ్ ను మిస్ చేశాడు. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే అతితక్కువ ఇన్నింగ్స్ లలో అత్యంత వేగంగా టీ20 సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. మసకద్జా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది అభిషేక్ సెంచరీని అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి బంతికే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్యాచ్‌తో ఔటయ్యాడు.
తక్కువ ఇన్నింగ్స్ లలో సెంచరీ కొట్టిన భారత ప్లేయర్లు
2 ఇన్నింగ్స్ లు - అభిషేక్ శర్మ*
3 ఇన్నింగ్స్ లు - దీపక్ హుడా
4 ఇన్నింగ్స్ లు - కేఎల్ రాహుల్
టీ20ల్లో సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడైన భారతీయులు
21y 279d – యశస్వి జైస్వాల్ vs నేపాల్, 2023
23y 146d – శుభ్‌మన్ గిల్ vs న్యూజిలాండ్, 2023
23y 156d – సురేష్ రైనా vs సౌతాఫ్రికా, 2010
23y 307d – అభిషేక్ శర్మ 4 vs జింబాబ్వే 2024
టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు-భారత ప్లేయర్లు
35 బంతులు - రోహిత్ శర్మ vs శ్రీలంక, ఇండోర్, 2017
45 - సూర్యకుమార్ యాదవ్ vs శ్రీలంక, రాజ్కోట్, 2023
46 - కేఎల్ రాహుల్ vs విండీస్, లాడర్ హిల్, 2016
46 - అభిషేక్ శర్మ vs జింబాబ్వే, హరారే, 2024
వికెట్ కీపింగ్ లో ఎదురులేని రారాజు ఎంఎస్ ధోని !