MS Dhoni - Salman Khan: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో జరిగిన ధోని పుట్టినరోజు వేడుకలో అర్ధరాత్రి తన భార్యతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ధోని పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు.
Happy birthday Dhoni bhai: మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం తన 43వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో జరిగిన పుట్టినరోజు వేడుకలో భార్య సాక్షి ధోని పాదాలను తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే పాదాలను తాకడంతో ధోనీ కూడా సాక్షని ఆశీర్వదించాడు. పుట్టినరోజు వేడుకల వీడియోను సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో 'ఇది గుడ్డు లేని కేక్ అనడంతో అవునా? అంటూ' అని ధోనీ చెప్పడం సహా సరదా క్షణాలు కనిపించాయి.
Sakshi Touching Dhoni's feet 😂❤️
Fangirl Moment for her .pic.twitter.com/WShcrcb7rz
సల్మాన్ ఖాన్ తో కలిసి ధోని బర్త్ డే సెలబ్రేషన్స్
మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. 'హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్!' అనే క్యాప్షన్‌తో సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో లైమ్‌లైట్‌కి దూరంగా ఉండే ధోని, ఇటీవల టీ20 ప్రపంచ కప్ విజయంపై భారత జట్టును అభినందించారు. దానిని తన ప్రత్యేక పుట్టినరోజు బహుమతిగా పేర్కొన్నాడు. ధోనీకి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే వీడియోను షేర్ చేసి, 'పార్టీ మొదలైంది! అంటూ పేర్కొంది.
To the man who makes a billion hearts flutter!
Super Birthday, Thala! 💛🥳
Write your special wish for Thala ✍️
🔗 - https://t.co/A6AOSO3SPY pic.twitter.com/lcsa638j4z
సురేష్ రైనా విషెస్
భారత మాజీ ప్లేయర్, ధోనీకి మంచి స్నేహితుడు అయిన సురేష్ రైనా కూడా పుట్టిన రోజు సందర్భంగా థాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే మహి భాయ్! మీ హెలికాప్టర్ షాట్ అంత అద్భుతంగా.. మీ స్టంపింగ్ టాలెంట్ అంత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని తన పోస్టులో పేర్కొన్నారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 'క్రికెట్‌లో నా ఏకైక అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మహి భాయ్.. మీరే ఒక పెద్ద బహుమతి.. ప్రేమతో.. అంటూ ట్విట్ చేశారు.
Happy Birthday, Mahi bhai! 🎉 Wishing you a day as cool as your helicopter shot and as epic as your stumping skills. Have a fantastic one, brotherman 🏏🥳 pic.twitter.com/g6M5MdclgN
— Suresh Raina🇮🇳 (@ImRaina)