IND vs ZIM 2nd T20: జింబాబ్వే తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. 100 పరుగుల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు.
IND vs ZIM 2nd T20: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా జింబాబ్వేపై సూపర్ విక్టరీ అందుకుంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, రుగురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ ల సునామీ ఇన్నింగ్స్ తో పాటు బౌలింగ్ లో ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ లు రాణించడంతో జింబాబ్వే పై టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో భారత్ ను దెబ్బకొట్టి విజయాన్ని అందుకుంది జింబాబ్వే. ఇంకా మిగిలిన మూడు మ్యాచ్ లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి.
భారత్- జింబాబ్వే రెండో మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో డకౌట్ అయిన ఐపీఎల్ స్టార్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో మాత్రం ధనాధన్ బ్యాటింగ్ తో సెంచరీ బాదాడు. 100 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్ల, 7 ఫోర్లు బాదాడ. రుతురాజ్ గైక్వాడ్ 77* పరుగులు అజేయంగా నిలిచాడు. చివరలో రింకూ సింగ్ బౌండరీలతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 42* పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ఈ భారీ ఇన్నింగ్స్ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది.
undefined
అభిషేక్ సెంచరీ, రితురాజ్-రింకూల అద్భుతమైన ఇన్నింగ్స్
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండు పరుగుల వద్ద గిల్ ఔట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో జింబాబ్వే బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో తొలి సెంచరీ కొట్టాడు. కేవలం 47 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. అలాగే, రితురాజ్ గైక్వాడ్ 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. అభిషేక్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అద్భుతమైన బౌలింగ్ తో జింబాబ్వేకు షాక్
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే ఆరంభం నుంచే దూకుండుగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ, అద్భుతమైన భారత్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. వరుసగా వికెట్టు సమర్పించుకుంది. భారత బౌలర్ల దెబ్బకు జింబాబ్వే జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అలాగే రవి బిష్ణోయ్‌కి 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్‌కు 1 వికెట్ పడగొట్టారు. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మాధేవెరే 43 పరుగులు, బ్రియాన్ బెన్నెట్ 26 పరుగులు, ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేశారు. జింబాబ్వేపై అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
Win in the 2nd T20I ✅
Strong bowling performance 👌
3️⃣ wickets each for and
2️⃣ wickets for Ravi Bishnoi
1️⃣ wicket for
Scorecard ▶️ https://t.co/yO8XjNqmgW | pic.twitter.com/YxQ2e5vtIU
8 సిక్సర్లు, 7 ఫోర్లు... జింబాబ్వే బౌలింగ్ ను ఉతికిపారేస్తూ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ